కల్కి నుంచి దీపికా అవుట్.. వంగా నవ్వేశాడా..?
ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో కూడా వైరల్ అయ్యింది. అయితే ఈ అనౌన్స్‌మెంట్ తర్వాత సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెద్దగా వైరల్ అయ్యింది.;
ప్రస్తుతం కల్కి 2898AD సీక్వెల్‌కు సంబంధించిన ఒక అప్డేట్ గట్టిగానే వైరల్ అవుతోంది. వైజయంతి మూవీస్ కొద్దిసేపటి క్రితం చేసిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌లో హీరోయిన్ దీపికా పదుకొణె ఇకపై సీక్వెల్‌లో భాగం కాబోరని స్పష్టంగా ప్రకటించారు. ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో కూడా వైరల్ అయ్యింది. అయితే ఈ అనౌన్స్‌మెంట్ తర్వాత సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెద్దగా వైరల్ అయ్యింది.
ఆ ట్వీట్‌ను కొందరు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు మీదనని భావించి షేర్ చేయడం మొదలుపెట్టారు. ఆ ట్వీట్‌లోని నవ్వుతున్న ఎమోజీలతో పాటు ఉన్న స్టైల్ చూసి చాలా మంది అది నిజమని నమ్మారు. కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే.. అది పూర్తిగా ఫేక్ అకౌంట్ నుంచి చేసిన పోస్ట్ అని. దీనివల్ల కొంతమంది నెటిజన్లు కన్ఫ్యూజ్ అయ్యారు.
నిజంగానే సందీప్ దీపికా ఇష్యూ మీద రియాక్ట్ అయ్యాడని అనుకుని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. అయితే దగ్గరగా గమనిస్తే ఆ అకౌంట్‌లో ఉన్న యూజర్ నేమ్ కూడా డైరెక్టర్ అధికారిక హ్యాండిల్ కాదని తేలిపోయింది. అంటే మొత్తం ఫేక్ ట్రిక్స్ వల్లే ఈ గందరగోళం సృష్టించబడింది.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతానికి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోయినా, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫేక్ పోస్ట్ కారణంగా మళ్లీ ఒకసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా దీపికా సందీప్ మధ్య గతంలో వచ్చిన అపోహల కారణంగా ఈ ట్వీట్ మరింత ఫైరయ్యింది.
నిజానికి టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోల పేర్లతో ఇలా ఫేక్ అకౌంట్లు సృష్టించి ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ఇలాంటి సందర్భాల్లో నమ్మకమైన అధికారిక హ్యాండిల్స్‌ని మాత్రమే ఫాలో కావాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి. లేకపోతే ఫేక్ పోస్ట్‌ల వల్ల తప్పుడు ప్రచారం జరిగి అనవసరమైన హడావిడి వస్తుంది. మొత్తానికి, కల్కి సీక్వెల్ నుంచి దీపికా ఔట్ అనేది నిజం కానీ, సందీప్ రెడ్డి వంగా ఫన్నీ ఎమోజీలతో స్పందించాడని సోషల్ మీడియాలో పాకిన వార్త మాత్రం పూర్తిగా ఫేక్. ఇప్పుడు ఫ్యాన్స్ అందరి ఫోకస్ మేకర్స్ ఎవరిని కొత్తగా హీరోయిన్‌గా తీసుకుంటారు అన్న దానిపైకి మళ్లింది. మరి కల్కి 2 గోల్డెన్ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.