ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది - సందీప్ రెడ్డి వంగా
అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీని మరో లెవెల్ కి తీసుకువెళ్లిన సినిమా అని చెప్పుకోవచ్చు.;
అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీని మరో లెవెల్ కి తీసుకువెళ్లిన సినిమా అని చెప్పుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగా తన దర్శకత్వ ప్రతిభతో ఎలాంటి స్టార్ట్డం లేని విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి తెరకెక్కించిన ఒక అద్భుతమైన సినిమా అర్జున్ రెడ్డి. అయితే అలాంటి అర్జున్ రెడ్డి సినిమా విడుదలై 8 సంవత్సరాలు పూర్తవడంతో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. మరి ఇంతకీ ఆయన పోస్టులో ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
విజయ్ దేవరకొండ హీరోగా..షాలినీ పాండే హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా 2017ఆగస్టు 25న విడుదలై ఎలాంటి అంచనాలు లేకుండానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కేవలం రూ.5కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా కథకి అప్పటి యూత్ ఎంతగానో అట్రాక్ట్ అయ్యారు. బయట కాలేజీల్లో ఎక్కడ చూసినా అర్జున్ రెడ్డి మేనియానే కనిపించింది. అయితే అలాంటి ఈ సినిమా విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో సందీప్ రెడ్డి వంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
ఆ పోస్టులో ఏముందంటే.. "నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన సినిమా అర్జున్ రెడ్డి.. ఎనిమిదేళ్ల క్రితం ఈ సినిమా నా లైఫ్ ని మార్చేసింది.. ఈ సినిమాలో వచ్చిన ప్రతి డైలాగ్.. ప్రతి ఫ్రేమ్.. ప్రతి ఎమోషన్ కి.. ఒక అర్థం వచ్చింది అంటే దానికి కారణం మీరు.. ఆ సినిమాని నిజాయితీగా స్వీకరించడమే.. మీ నుండి నాకు అంతులేని మద్దతు, ప్రేమ అందడం వల్లే ఈ సినిమా ఒక ఉద్యమంలా మారింది. ఈ సినిమా కథ నా మనస్సుకు చాలా దగ్గరయ్యింది. ఈ సినిమా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గానూ నటులకు.. నా బృందానికి.. అభిమానులకు..అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతుడిగానే ఉంటాను.. సినిమా విడుదలై 8 ఏళ్లయినా కూడా ఇంకా సజీవంగా.. సహజంగా అనిపిస్తోంది. మీ అందరికీ నా ధన్యవాదాలు.. సినిమాను శాశ్వతంగా నిలిపినందుకు" అంటూ సందీప్ రెడ్డి వంగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ తో పాటు అర్జున్ రెడ్డి సినిమాకి సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను కూడా ఇందులో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ తో పాటు సందీప్ రెడ్డి వంగ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు.
ఇక అర్జున్ రెడ్డి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా కథని మొదట ఓ ముగ్గురు హీరోలకి వినిపించారట డైరెక్టర్. కానీ అందులో ఎవరికి కూడా కథ నచ్చకపోవడం.. అలాగే ఇలాంటి పాత్రల్లో నటిస్తే అభిమానులు ఒప్పుకోరనే భయంతో రిజెక్ట్ చేశారట. అందులో శర్వానంద్, మంచు మనోజ్ లు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరోలే బయట పెట్టారు కూడా. అలా ముగ్గురు రిజెక్ట్ చేసిన ఈ సినిమాని చివరికి విజయ్ దేవరకొండ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా పెరిగింది.