• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత చేస్తానంటే వాళ్లు...

సమంత చేస్తానంటే వాళ్లు ఓకే అట..!

| ఇక ఈ మధ్య పుష 2 స్పెషల్ సాంగ్ మీద డిస్కషన్ నడుస్తుంది. సినిమాలో ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ భామలను అడుగుతున్నారని తెలుస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-02-19 06:10 GMT

పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్ల హంగామా సృష్టించిన పుష్ప సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పుష్ప రాజ్ క్యారెక్టరైజేషన్ బాలీవుడ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే పుష్ప 2 పై అక్కడ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పుష్ప 2 లో శ్రీ వల్లిగా రష్మిక మరోసారి తన ప్రతిభ చాటనుంది. సినిమాలో ఆమె పాత్ర త్వరగానే ఎండ్ అవుతుందని తెలుస్తుంది.

సినిమాలో మరో హీరోయిన్ ఉంటుందని తెలుస్తుండగా అది ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈమధ్య పుష 2 స్పెషల్ సాంగ్ మీద డిస్కషన్ నడుస్తుంది. సినిమాలో ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ భామలను అడుగుతున్నారని తెలుస్తుంది. పుష్ప 1 స్పెషల్ సాంగ్ లో సమంత అదరగొట్టేసింది. ఉ అంటావా ఉ ఉ అంటావా అంటూ నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని తన మాయలో పడేసుకుంది. ఆ సాంగ్ లో సమంత చేసిన గ్లామర్ షో కూడా సాంగ్ హిట్ కి కారణమైంది.

పుష్ప 2 లో కూడా సమంతనే రిపీట్ చేయాలని సుకుమార్ ప్లాన్. ఖుషి తర్వాత సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే స్పెషల్ సాంగ్ కోసం సమంత దాకా వెళ్తే మాత్రం కచ్చితంగా అమ్మడు ఓకే చెప్పే ఛాన్స్ ఉంటుంది. పుష్ప 1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. పుష్ప 2 పై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. సో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తే సమంతకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఆల్రెడీ బాలీవుడ్ ఆడియన్స్ కి సమంత పరిచయమే. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ లో నటించిన అమ్మడు సిటాడెల్ వెబ్ సీరీస్ లో కూడా నటించింది. పుష్ప 2 లో సమంత చేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మేకర్స్ సమంత ఓకే అంటే ఆమెనే తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి సమంత నుంచి ఏమాత్రం హింట్ వచ్చినా పుష్ప 2 లో ఉ అంటావా కాదు అంతకుమించి సాంగ్ తో రెచ్చిపోవడం పక్కా అని చెప్పొచ్చు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత సమంత మళ్లీ తిరిగి వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో పుష్ప 2 చేస్తే మాత్రం అమ్మడి కెరీర్ కి ఈ టైం లో మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు.

Tags:    
  • Samantharuthprabhu 
  • Staractress 
  • Tollywood 
  • Itemsong 
  • Bollywoodactress 
  • Sukmar 
  • Specialsong 

Similar News

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

2026-11-16 17:30 GMT

సీనియర్ హీరోలు ఈ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయబోతున్నారా?

2026-11-16 16:30 GMT

దుల్కర్ సల్మాన్ స్టోరీ సెలెక్షన్ లో ఏం చూస్తాడో తెలుసా.? దానివల్లే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందా?

2026-11-16 15:30 GMT

ఏడాదిలో రెండు ప్లాన్‌ చేస్తున్న అల్లు అర్జున్‌

2026-11-16 14:30 GMT

వారణాసి వాయిదా పడాలని కోరుకుంటున్న ఫ్యాన్స్‌..!

2026-11-16 13:30 GMT

ప‌డిన చోటే లేచేలా బాల‌య్య‌ ప్ర‌య‌త్నం!

2026-11-16 12:30 GMT

ఇప్పుడు వదలకపోతే.. పెళ్లి జరగదు.. న‌న్ను వదిలేయండి ప్లీజ్!

2026-11-16 11:30 GMT

తేజ సజ్జ నిశ్చితార్థ వేడుకల్లో తొలిసారి భార్యతో కనిపించిన బెల్లంకొండ హీరో!

2026-11-16 11:27 GMT

గురూజీకి పాన్ ఇండియా ఎంత కీల‌క‌మంటే?

2026-11-16 11:27 GMT

రాముడి పాత్రలో మహేశ్ బాబు.. రణబీర్ లుక్‌ను ఫాలో అవుతారా?

2026-11-16 11:12 GMT

ఎన్టీఆర్‌-అనిల్‌ మూవీపై ఫ్యాన్స్ రియాక్షన్‌ ఇదే..!

2026-11-16 11:11 GMT

తేజ సజ్జ ఎంగేజ్‌మెంట్‌.. ఆ బాండింగ్ ఇప్పటికీ అలాగే!

2026-11-16 11:07 GMT

Copyright @2026

Powered by Blink CMS