కండిషన్స్ పెట్టడం నచ్చదు
నటి సమంత మోడలింగ్ నుంచి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. మొదటి సినిమా ఏ మాయ చేసావే తోనే నటిగా మంచి పేరుతో పాటూ ఎంతో ఫాలోయింగ్, క్రేజ్ ను సొంతం చేసుకుంది.;
నటి సమంత మోడలింగ్ నుంచి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. మొదటి సినిమా ఏ మాయ చేసావే తోనే నటిగా మంచి పేరుతో పాటూ ఎంతో ఫాలోయింగ్, క్రేజ్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ను కూడా తన ఖాతాలో వేసుకున్న సమంత తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి వెంటనే సమంత స్టార్ హీరోయిన్ అవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొంత కాలం తర్వాత వారి మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరి జీవితంలో వాళ్లు బిజీ అయ్యారు. చైతన్యతో విడిపోయాక సమంత మయోసైటిస్ బారిన పడి ఆరోగ్యం దెబ్బతినడం, ఆ చికిత్స కోసం కొంతకాలం పాటూ సినిమాలకు దూరమవడం జరిగాయి.
ఇప్పుడు అన్ని సమస్యల నుంచి బయటపడి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న సమంత ఏదొక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సిడ్నీలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న సమంత అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. రూల్స్ పెడితే తనకు నచ్చదని, తనకు ఇష్టం వచ్చినట్టు తాను జీవించాలనుకుంటున్నానని సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
మనకు నచ్చినట్టు జీవించినప్పుడే లైఫ్ లో సక్సెస్ అవుతామని, సక్సెస్ అంటే కేవలం విజయాలు మాత్రమే కాదని, ట్రై చేయడం కూడా సక్సెస్ లో భాగమేనని చెప్పిన సామ్, సినిమాల్లో తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తానని, అప్పుడే తన లైఫ్ సక్సెస్ అవుతుందని తెలిపింది. దీంతో సమంత ఈ కామెంట్స్ చైతూని ఉద్దేశించే చేసిందని సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది.
గతంలో సమంత చేసే సినిమాలు, ఆమె ఎంచుకునే పాత్రలపై నాగ చైతన్యతో పాటూ, అక్కినేని కుటుంబం కూడా కండిషన్స్ పెట్టిందని, అందుకే చైతూ సమంత విడిపోయారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమంత, నాగ చైతన్య విడిపోయి కూడా నాలుగేళ్లవుతోంది. ఇద్దరూ ఎవరి లైఫ్ లో వాళ్లు సంతోషంగా ఉన్నారు. అయినప్పటికీ వారి గురించి ఏదొక వార్త నెట్టింట వినిపిస్తూనే ఉంది.