ఆ విషయంలో సామ్ బయటపడినట్టేనా?
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్తుగా ఏదొక విషయంలో వార్తల్లోనే నిలుస్తూనే ఉంది. రీసెంట్ గా నిర్మాతగా మారిన సమంత మొదటి సినిమా శుభంతోనే మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.;
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్తుగా ఏదొక విషయంలో వార్తల్లోనే నిలుస్తూనే ఉంది. రీసెంట్ గా నిర్మాతగా మారిన సమంత మొదటి సినిమా శుభంతోనే మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా సమంత పర్సనల్ లైఫ్ విషయంలో కూడా పలు వార్తలొస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలొచ్చాయి.
అయితే ఈ విషయంపై అటు సమంత కానీ, ఇటు రాజ్ కానీ ఎవరూ ఇప్పటివరకు ఓపెన్ అయి మాట్లాడింది లేదు. ఫ్యామిలీ మ్యాన్2 సిరీస్ తర్వాత నుంచి రాజ్ తో సమంతకు మంచి బాండింగ్ ఏర్పడిందనేది మాత్రమే బయటకు చెప్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత ఇక తన రిలేషన్‌షిప్ ను సీక్రెట్ ఉంచడం లేదని ఫ్యాన్స్ చెప్తున్నారు. దానికి కారణం సమంత రీసెంట్ గా తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్.
సమంత తాజాగా తన ఇన్‌స్టా టైమ్ లైన్ లో రాజ్ నిడిమోరు మరియు తన ఫ్రెండ్ తో కలిసి పికిల్ బాల్ ఆడుతున్న పోస్ట్ ను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన తర్వాత ఆమె ఫ్యాన్స్ ఇకనైనా తమ బంధాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి బయట వస్తున్న వార్తలకు చెక్ పెట్టాల్సిన టైమ్ వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా సమంత తన సోషల్ మీడియా మంథ్లీ ర్యాప్ ను షేర్ చేసింది.
అందులో కూడా రాజ్ ఓ అందమైన ఫోటోలో కనిపించాడు. ఇప్పటికే సమంత, రాజ్ చాలా చోట్ల కలిసి కనిపించారు. రీసెంట్ గా ఇద్దరూ కలిసి గుడికి కూడా వెళ్లడంతో సమంత ఆధ్యాత్మికత ప్రభావం రాజ్ కు కూడా అంటుకుందని అందరూ అనుకున్నారు. నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత చైతన్య మరో పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉన్న నేపథ్యంలో సమంత కూడా తన ఆనందాన్ని వెతుక్కోవాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే సమంత ప్రస్తుం రక్త్ బ్రహ్మాండ్ తో పాటూ మా ఇంటి బంగారం అనే సినిమాల్లో నటిస్తోంది.