సమంత 'పవర్ మార్నింగ్'.. వీడియోతో స్పెషల్ పోస్ట్!
తాజాగా ఆమె తన 'పవర్ మార్నింగ్' రొటీన్‌ను అభిమానులతో పంచుకుంటూ ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. ఉదయాన్నే మనం చేసే పనులే ఆ రోజంతా మన మూడ్‌ను డిసైడ్ చేస్తాయని ఆమె నమ్ముతోంది.;
స్టార్ హీరోయిన్ సమంత తన హెల్త్ మరియు ఫిట్‌నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఆమె తన 'పవర్ మార్నింగ్' రొటీన్‌ను అభిమానులతో పంచుకుంటూ ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. ఉదయాన్నే మనం చేసే పనులే ఆ రోజంతా మన మూడ్‌ను డిసైడ్ చేస్తాయని ఆమె నమ్ముతోంది. ఒత్తిడిని తగ్గించుకుని, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఆమె పాటిస్తున్న ఆ సింపుల్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉదయాన్నే ఫోన్‌కు దూరంగా..:
సమంత చెప్పిన మొదటి మరియు అతి ముఖ్యమైన రూల్ ఏంటంటే.. నిద్రలేవగానే గంట వరకు ఫోన్ ముట్టుకోకూడదు. ఇక సాధారణంగా మనం కళ్లు తెరవగానే వాట్సాప్ మెసేజ్‌లు, ఈమెయిల్స్ చూస్తూ ఒత్తిడికి గురవుతాము. కానీ సమంత మాత్రం నిద్రలేవగానే మన శరీరంలో ఉండే ఒత్తిడి హార్మోన్లను అదుపులో ఉంచుకోవడానికి ఫోన్‌ను పక్కన పెట్టేయాలని సూచించింది. ఇక అలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, కొత్త రోజను ఆహ్వానించడానికి సిద్ధమవుతుందని ఆమె తన అనుభవాన్ని పంచుకుంది.
ఆరోగ్యం కోసం ఈ సూత్రాలు:
సమంత తన 'పవర్ మార్నింగ్'లో భాగంగా ఎనిమిది కీలక నియమాలను పాటిస్తోంది. నిద్రలేవగానే ఐదు నిమిషాల పాటు ధ్యానం చేయడం, కాసేపు సూర్యరశ్మి తగిలేలా కూర్చోవడం ఆమె దినచర్యలో భాగం. ఇక హెల్త్ డ్రింక్ విషయానికొస్తే.. గోరువెచ్చటి నీళ్లలో పసుపు, నిమ్మరసం కలిపి తాగుతుందట. అలాగే 11 గంటల లోపే వర్కౌట్లు పూర్తి చేసి, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చని ఆమె వివరించింది.
గోల్ సెట్టింగ్.. రాసుకోవడం అలవాటు:
కేవలం శారీరక వ్యాయామమే కాదు, మానసిక స్పష్టత కూడా ముఖ్యమని సామ్ అంటోంది. ఆ రోజు మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఏ పనులు పూర్తి చేయాలి అనే విషయాలను ఒక పుస్తకంలో రాసుకోవడం ఆమెకు అలవాటు. ఇక దీనివల్ల సమయం వృధా కాకుండా, పనులన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయని ఆమె తెలిపింది. జీవితంలో నిజంగా మార్పు కావాలనుకునే వారు కనీసం 21 రోజుల పాటు ఈ 'పవర్ మార్నింగ్' పద్ధతిని ఫాలో అవ్వాలని ఆమె తన ఫాలోవర్లకు ఛాలెంజ్ విసిరింది.
మీరూ ట్రై చేస్తారా?:
ఇక ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే సమంత, తన వ్యక్తిగత జీవితంలో పాటిస్తున్న ఈ చిన్న చిన్న మార్పులు ఎంతో ప్రభావం చూపుతాయని నిరూపించింది. సింపుల్ గా అనిపించినా, ఈ అలవాట్లు మనల్ని మానసికంగా, శారీరకగా దృఢంగా ఉంచుతాయనడంలో సందేహం లేదు. మీరు కూడా సమంతలాగా ఉత్సాహంగా ఉండాలనుకుంటే, రేపటి నుంచే ఆ 'పవర్ మార్నింగ్' మొదలుపెట్టేయండి.