• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంతకు స్ఫూర్తినిచ్చే...

సమంతకు స్ఫూర్తినిచ్చే కవిత..!

| తాజాగా మరోసారి అలాంటి ఒక కవితను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

By - Tupaki Desk
Update: 2024-11-21 05:44 GMT

స్టార్‌ హీరోయిన్‌ సమంత మరోసారి సోషల్‌ మీడియా ద్వారా ఆసక్తికర పోస్ట్‌ను షేర్‌ చేశారు. తన అందమైన ఫోటోలను, సినిమా, సిరీస్‌లకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను మాత్రమే కాకుండా అప్పుడప్పుడు జీవిత సత్యాలను, ఇన్సిపిరేషన్‌ కోట్స్‌ను, జీవితంలో ముందుకు సాగేందుకు ఉపయోగపడే ఎన్నో గొప్ప సుక్తులను సమంత సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఉంటారు. ఏ సూక్తులతో అయితే తాను స్ఫూర్తి పొందుతుందో వాటిని జనాలతో పంచుకోవడం సమంతకు అలవాటు. తాజాగా మరోసారి అలాంటి ఒక కవితను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు జీవితంలో ఒడిదొడుకులు ఎదురైన సమయంలో ఈ పద్యం స్ఫూర్తిని నింపింది అంటూ ఈ పద్యంను షేర్‌ చేసింది. మీ జీవితంలో అంతా కోల్పోయినప్పుడు, మిమ్ములను అంతా నిందిస్తున్నప్పుడు, మీరు తల ఎత్తుకుని నిలబడితే, పురుషులు అంతా మిమ్మల్ని అవమానించినప్పుడు, మిమ్మల్ని మీరు నమ్మితే కచ్చితంగా విజయం సాధిస్తారు అంటూ ఆసక్తికర లైన్స్‌ను షేర్‌ చేసింది. ఇంకా ఆ పద్యంలో విజయాలన్నింటిని పక్కన పెట్టి రిస్క్‌ చేసినప్పుడు ఆ సమయంలో ఓడిపోతే కొత్తగా మళ్లీ ప్రయాణంను మొదలు పెట్టాలి. అంతే తప్ప ఓటమి గురించి ఎక్కువ ఆలోచిస్తూ అలాగే కూర్చుని ఉండకూడదు. ఆ ఓటమితో మన హృదయం ను మరింత కఠినంగా మార్చుకుని కష్టపడాల్సిన సమయం అంటూ పద్యంను షేర్‌ చేసింది.

మీ దగ్గర ఏమీ లేనప్పుడు సంకల్పం అనే దాన్ని గట్టిగా పట్టుకోవడం ద్వారా దేన్ని అయినా సాధిస్తారు. అప్పుడు మనను నిందించే వారికి సరైన సమాధానం చెప్పవచ్చు అనే అర్థం వచ్చే విధంగా ఉన్న పద్యంను సమంత షేర్‌ చేశారు. సమంత ఇలాంటి కొటేషన్స్‌, కవితలు, కవిత్వాలు చాలానే షేర్‌ చేస్తూ ఉంటారు. ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపుతూ ఉంటారు. ఆమె షేర్‌ చేసే లైన్స్‌ కి చాలా మంది అభిమానులు ఉంటారు. తన సొంత లైన్స్‌ను మాత్రమే కాకుండా గొప్ప వ్యక్తులు చెప్పిన లైన్స్‌ని, పద్యాలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

సమంత ఇటీవలే సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో వైపు మా ఇంటి బంగారం అనే సినిమాను చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అనే విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలీవుడ్‌లో ఒక సినిమాతో పాటు ఒక వెబ్‌ సిరీస్‌ను ఈమె చేసేందుకు కమిట్‌ అయింది. సౌత్‌లో కంటే ఈమె ఎక్కువగా హిందీలో సినిమాలు సిరీస్‌లు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ముంబైలోనే ఈ అమ్మడు ఎక్కువగా ఉంటుంది అంటూ ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

Tags:    
  • Samantha 
  • Actress 
  • Tollywood 
  • Citadelhoneybunny 
  • Samanthaquotes 
  • Instagram 
  • Inspirationquotes 
  • Samanthamovies 
  • Maaintibangaram 
  • Filmindustry 

Similar News

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

Copyright @2026

Powered by Blink CMS