బంగారం బాధ్య‌త‌లు అంతా స‌వ్యంగానేనా?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో `మా ఇంటి బంగారం` చిత్రం ప్ర‌క‌టించి చాలా కాల‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-08-25 22:30 GMT

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో `మా ఇంటి బంగారం` చిత్రం ప్ర‌క‌టించి చాలా కాల‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. సామ్ త‌న సొంత నిర్మాణ సంస్థ‌ ట్రాలాల మూవీంగ్ పిక్చ‌ర్ పై బంగారాన్ని నిర్మించాల‌ని సంక‌ల్పించారు. ఇదే సినిమాతో మ‌రికొంత మంది కొత్త వాళ్ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. దీనిలో భాగంగా బంగారం ద‌ర్శ‌కుడు కూడా కొత్త వారే? అన్న ప్ర‌చారం జ‌రిగింది. అప్పుడు డైరెక్ట‌ర్ గా అత‌డు గా తెర‌పైకి వ‌చ్చాడు. కానీ ఇప్పుడా అత‌డు ఆమె గా మారారు. అవును ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్య‌త‌లు సామ్ లేడీ డైరెక్ట‌ర్ నందినీ రెడ్డికి అప్ప‌గించిన‌ట్లు వినిపిస్తోంది.

ప్రెండ్ కి మ‌రో ఛాన్స్:

స‌మంత చాలా మంది మేక‌ర్స్ ని ప‌రిశీలించిన అనంత‌రం నందినీ రెడ్డిని ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. స‌మంత‌- నందిని మ‌ధ్య ప్ర‌త్యేక‌మైన బాండింగ్ ఉంది. ఇద్ద‌రు మంచి స్నేహితులుగా మెలుగుతారు. గ‌తంతో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో `ఓ బేబి` తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే. ఆ క్రైమ్ థ్రిల్ల‌ర్ ని నందిని బాగానే డీల్ చేసారు. కానీ సినిమా అనుకున్నంత‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. యావ‌రేజ్ హిట్ గా నిలిచింది. అదో విదేశీ సినిమా రీమేక్ రూపం. `బేబి` కంటే ముందు `జ‌బ‌ర్ద‌స్త్` సినిమాకు సామ్- నందిని క‌లిసి ప‌ని చేసారు.

భారీ హిట్ల‌కు భిన్నంగా:

అందులో సామ్ హీరోయిన్ కాగా, నందిని ద‌ర్శ‌కులు రాలు. ఆ సినిమా కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. అదీ కూడా హిందీ రీమేక్ చిత్రం. ఈ నేప‌థ్యంలో సామ్ మ‌రోసారి నందిని రెడ్డిని తెర‌పైకి తేవడం ఆస‌క్తిక‌రంగా మారిం ది. సాధార‌ణంగా ఏ డైరెక్ట‌ర్ కి అయినా భారీ హిట్లు ఉంటేనే అవ‌కాశాలు వ‌స్తుంటాయి. స్టార్ హీరోలంతా పిలిచి మ‌రీ ఛాన్సులిస్తుంటారు. యావ‌రేజ్ , బిలో యావ‌రేజ్ హిట్ తో అవకాశాలు క‌ష్టం. కానీ సమంత మాత్రం మ‌రోసారి నందినీని న‌మ్ముకోడం ఇంట్రెస్టింగ్.

అవ‌కాశం సిద్దంగా:

`మా ఇంటి బంగారం` కూడా క్రైమ్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌థ‌ను ఆధారంగా చేసు కునే నందిని రెడ్డి డీల్ చేయ‌గ‌ల‌రు? అన్న న‌మ్మ‌కంతో సామ్ ఛాన్స్ ఇచ్చార‌న్న‌ది మ‌రో వెర్ష‌న్. మ‌రి సమంత నమ్మకం నిల‌బ‌డుతుందా? లేదా? అన్నది నందినీ రెడ్డి చేతుల్లో ఉంది. నందిని రెడ్డి ద‌ర్శ‌కు రాలిగా సినిమాలు చేసి రెండేళ్లు అవుతుంది. చివ‌రిగా ఆమె డైరెక్ట‌ర్ చేసిన `అన్నీ మంచి శ‌కున‌ములే` 2023 లో రిలీజ్ అయింది. ఆ తర్వాత మ‌ళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్క‌లేదు. మ‌ళ్లీ సామ్ కార‌ణంగా అవ‌కాశం రెడీగా ఉంది.

Tags:    

Similar News