ఫ్రెండ్ తో క‌లిసి కంబ్యాక్ ఇవ్వ‌నున్న స్టార్ హీరోయిన్?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన స‌మంత హీరోయిన్ గా సినిమా వ‌చ్చి 2 ఏళ్ల‌వుతుంది.;

Update: 2025-07-21 10:30 GMT

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన స‌మంత హీరోయిన్ గా సినిమా వ‌చ్చి 2 ఏళ్ల‌వుతుంది. ఒక‌ప్పుడు వ‌రుస పెట్టి సినిమాలను చేసే స‌మంత నుంచి ఖుషి త‌ర్వాత మ‌రో సినిమా వ‌చ్చింది లేదు. స‌మంత నిర్మాత‌గా మారి శుభం అనే తెలుగు సినిమాతో మంచి హిట్ అందుకోవ‌డంతో పాటూ ఆ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కూడా క‌నిపించి ఆడియ‌న్స్ ను అల‌రించారు స‌మంత‌.

శుభం సినిమాలో స‌మంత క‌నిపించిన‌ప్ప‌టికీ అందులో ఆమె మెయిన్ లీడ్ కాదు, అందులో కేవ‌లం స‌మంత గెస్ట్ అప్పీరియ‌రెన్స్ మాత్ర‌మే ఇచ్చారు. వ‌రుస పెట్టి సినిమాలు చేసిన‌ స‌మంత నుంచి రెండేళ్ళ గ్యాప్ రావ‌డంతో ఆమె ఫ్యాన్స్ స‌మంత ఎప్పుడెప్పుడు తెలుగు సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌మంత త్వ‌ర‌లోనే ఓ తెలుగు సినిమా చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి.

ఆ సినిమాకు స‌మంత ఫ్రెండ్, డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. స‌మంత‌, నందినీ రెడ్డి క‌లిసి ఇప్ప‌టికే రెండు సినిమాలు చేశారు. అందులో ఒక‌టి జ‌బ‌ర్ద‌స్త్ కాగా రెండోది ఓ బేబీ. ఈ రెండింట్లో ఓ బేబీ మంచి హిట్ గా నిల‌వ‌డంతో పాటూ స‌మంత‌కు ఆ సినిమా మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది. కాగా ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి త‌మ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

అందులో భాగంగానే స‌మంత‌, నందినీ రెడ్డి మ‌ధ్య డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని, దాన్ని కూడా స‌మంత త‌న సొంత బ్యాన‌ర్ లోనే నిర్మించ‌నున్నార‌ని అంటున్నారు. నందినీ రెడ్డి మీద ఎంతో అభిమాన‌మున్న స‌మంత ఆమె చెప్పే క‌థ న‌చ్చితే ఏమీ ఆలోచించ‌కుండా వెంట‌నే ఓకే అనేస్తారు. అయితే ఇందులో ఏ మేర నిజ‌ముంద‌నేది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా స‌మంత ఫ్యామిలీ మ్యాన్2 సిరీస్ కోసం ముంబై వెళ్లి ఆ త‌ర్వాత అక్క‌డే సెటిలైన విష‌యం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్2 తో మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌మంత ఆ త‌ర్వాత వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి సిటాడెల్ చేశారు. ప్ర‌స్తుతం స‌మంత రక్త్ బ్ర‌హ్మాండ్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. దాంతో పాటూ స‌మంత తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేశారు కానీ ఆ త‌ర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

Tags:    

Similar News