మయోసైటిస్‌పై సమంత సంచలన వ్యాఖ్యలు!
సమంత `మైయోసైటిస్` అనే వ్యాది బారిన పడటం..కోల్కోవడం తెలిసిందే. ఇదంతా జరిగి రెండు..మూడు సంవత్సరాలు గడుస్తున్నా? సమంత మాత్రం ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలను బయటకు రాలేకోపోతుంది.
సమంత `మైయోసైటిస్` అనే వ్యాది బారిన పడటం..కోల్కోవడం తెలిసిందే. ఇదంతా జరిగి రెండు..మూడు సంవత్సరాలు గడుస్తున్నా? సమంత మాత్రం ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలను బయటకు రాలేకోపోతుంది. తాజాగా మరోసారి సమంత మయోసైటిస్ వ్యాధి నిర్దారణ సమయాన్ని గుర్తుచేసుకుంటూ సంచలన విషయాలను వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ అయిన ప్రారంభ రోజుల్లో తన సొంత ఐడెంటిటీని పూర్తిగా కోల్పోయినట్లు అనిపించిందని, జీవితంపై తనకేమీ నియంత్రణ లేదనే తీవ్ర అభద్రతాభావంలోకి వెళ్లిపోయానని సమంత తాజాగా రివీల్ చేసారు.
నటిగా తన ఆత్మవిశ్వాసాన్ని నిరంతరం వర్కౌట్లు, సరైన దినచర్య ద్వారా ఎంతో కష్టపడి నిర్మించుకుంటానన్నారు. అయితే అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం చుట్టుముట్టినప్పుడు మనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉందనే విషయంతో ఆరోగ్యానికి సంబంధం ఉండదని ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయాననన్నారు. కష్టకాలంలో నాకే ఎందుకు ఇలా జరిగింది? అని తీవ్రంగా మధనపడ్డానని సమంత పేర్కొన్నారు. అయితే పరిస్థితులకు ఎలా స్పందించాలనేది తన చేతుల్లోనే ఉందనే విషయాన్ని గ్రహించడానికి కొంత సమయం పట్టిందన్నారు.
సమాజం కోసం నకిలీ ఆత్మవిశ్వాసాన్ని నటించడం కంటే జీవితంలో నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలు మరికొన్ని ఉన్నాయని ఆ సమయంలోనే అర్దమైందన్నారు. అనారోగ్యం జీవితానికి సంబంధించిన అనేక కీలక విషయాలను నేర్పించిందన్నారు. ఓర్పు, విశ్వాసం, ఆశ వంటి అత్యంత ముఖ్యమైన గుణాలను ఈ కష్ట కాలంలో అలవాటు అయ్యాయన్నారు. ఓపిక, సహనం జీవితాన్ని మరింత అందంగా నిర్మించుకోవడానికి దోహదపడ్డాయన్నారు. ప్రతీ మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితులకు గురి కావాల్సి ఉంటుందని..అందుకు సిద్దంగా ఉండటం ఒక్కటే మార్గమన్నారు.
ప్రస్తుతం సమంత జీవితంలో సెకెండ్ ఇన్నింగ్స్ లో ఉన్నారు. తొలి ప్రయత్నం `మా ఇంటి బంగారం` గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే అదిరిపోయే లాంచింగ్ దొరికినట్లు అయింది. ఆ సంతోషం మరింత రెట్టింపు అయ్యేలా సామ్ గర్బం దాల్చడం అంతకు మించిన గొప్ప విశేషం. సమంత -రాజ్ నిడిమోరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన ఏడాదే సమంత మామ్ అవుతుండటం విశేషం.