లవ్, లైంగికతపై ఓర్రీ తొలిసారి ఓపెన్ టాక్!

ప్రేమ , సంబంధాల గురించి ఓర్రీ ఎంతో ఓపెన్‌గా స్పందించారు. తాన జీవితంలో చాలాసార్లు ప్రేమలో పడ్డానని, అనేకమార్లు గుండెకోతకు గురయ్యానని తెలిపారు.

Update: 2026-09-11 07:07 GMT

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ వ్యక్తిగత జీవితం, లైంగికత , మస్క్యులినిటీ, ప్రేమకు సంబంధించిన అంశాలపై తొలిసారిగా స్పందించారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓర్రీ ఓపెన్ అయ్యారు. బోర్డింగ్ స్కూల్‌లో చదు వుతున్న రోజుల్లోనే తన వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలను అన్వేషించే స్వేచ్ఛ లభించిందని తెలిపారు. కొత్త విషయాలను ప్రయత్నించడానికి తానెప్పుడు భయపడలేదని, వివిధ రకాల దుస్తులు, వ్యక్తిత్వాలను పరిశీలించిన తర్వాతే నేటి రూపానికి చేరుకున్నానని పేర్కొన్నారు.

తన లైంగికత ..గుర్తింపుపై సమాజం వేసే లేబుళ్లను తాను అస్సలు పట్టించుకోనని ఓర్రీ స్పష్టం చేశారు. తన జీవితం ఇతరుల గుర్తింపు మీద ఆధారపడి నడవదని, తాను బాగా చేసినా? లేదా పొరపాట్లు చేసినా? ఇతరుల ప్రశంసలు తనకు అవసరం లేద‌న్నారు. క్వీర్ కమ్యూనిటీకి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని కొందరు భావిస్తారని అయితే ఆ కమ్యూనిటీకి నాయకుడిగా ఉండమని తానెప్పుడూ కోరలేదని, ఆ బాధ్యతను కూడా తీసుకోలేదన్నారు. ప్రారంభంలో ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పుడు ఎవరూ తనకు మద్దతుగా నిలవలేదని.. తన సొంత బలంతోనే ఈ స్థాయికి వ‌చ్చాన‌న్నారు.

అలాగే పురుషత్వం గురించి ఓర్రీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ప్రపంచంలో ఈ పదంపై అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నా? తాను మాత్రం పురుషత్వం విషయంలో ప్రాచీన భావజాలన్నే నమ్ముతానని తెలిపారు. టాల్, బ్రాడ్, ఫిట్ బాడీ గంభీరమైన స్వరం కలిగిన ఆల్ఫా మేల్ ప్రతిరూపంగా దర్శకుడు రోహిత్ శెట్టిని ఉదాహరణగా చెప్పారు. ప్రపంచంలో ఎవరూ 100 శాతం మాస్క్యులిన్‌గా ఉండరని, తన శారీరక నిర్మాణం మాచో ఇమేజ్‌కి సరిపోకపోయినప్పటికీ అంతిమంగా తాను పురుషుడినని .. తనలో కొంత స్త్రీతత్వం ఉండటాన్ని కూడా ఇష్టపడతానని పేర్కొన్నారు.

ప్రేమ , సంబంధాల గురించి ఓర్రీ ఎంతో ఓపెన్‌గా స్పందించారు. తాన జీవితంలో చాలాసార్లు ప్రేమలో పడ్డానని, అనేకమార్లు గుండెకోతకు గురయ్యానని తెలిపారు. స్థిరత్వం లేదా ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో తనకు ప్రేమ కనిపించదని, కాస్త డ్రామా, టాక్సిసిటీ ఉన్న రోమియో-జూలియట్ తరహా భావోద్వేగాల ప్రయాణాన్నే తాను నిజమైన ప్రేమగా భావిస్తానని వ్యాఖ్యానించారు.

సహచరులు, స్నేహితులతో ఎప్పుడూ బిజీగా ఉండే ఓర్రీ జీవితంలో ఏకాంతం గురించి కూడా ప్రస్తావించారు. ఏకాంతం అనేది శాశ్వతమైన భావన కాదని అది వచ్చి వెళ్లే ఒక అతిథి లాంటిద‌న్నారు. తన స్నేహితులంతా పని, ఉద్యోగాలు, వ్యాయామాలతో బిజీగా ఉంటారని కానీ తనకు ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు ఒంటరితనం అనిపిస్తుందన్నారు. ప్రతిరోజూ వీకెండ్ లాగా ఉండటం వల్ల శుక్రవారం రాత్రి ఇచ్చే ప్రత్యేక అనుభూతిని తాను కోల్పోయానని.. రోజూ ఏదో పనితో బిజీగా ఉండటానికి త్వరలోనే ఓ ఉద్యోగం వెతుక్కుంటానని సరదాగా న‌వ్వేసారు.

ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని గత వారమే ఒక రిలేషన్‌షిప్‌కు ముగింపు పడిందని ఓర్రీ వెల్లడించారు. గతంలో ప్రేమించిన వారి కోసం తన సొంత ప్రపంచాన్ని వదులుకుని వారి జీవితంలోకి వెళ్లిపోయేవాడినని అయితే ఇటీవలి బ్రేక్‌అప్ ద్వారా ఓర్రీ ప్రపంచానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయ గ్రహించిన‌ట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు నెటిజన్ శివప్రీత్ సువర్ణతో తాను డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఒర్రీ ఖండించారు. ఇద్ద‌రం మంచి స్నేహితులని సోషల్ మీడియా కంటెంట్ కోసమే కలిసి కనిపిస్తుంటామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News