'ఇరుముడి'ని మించి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా?
ఇంతకు ముందు సక్సెస్ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఈసారి భారీ ఎత్తున సక్సెస్ వేడుకను నిర్వహించడం జరిగింది.
రవితేజ 'ఇరుముడి' సినిమా మూడు వారాల పాటు కంటిన్యూగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు సాధించిన ఇరుముడి సినిమా సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. పాన్ ఇండియా ట్యాగ్ లేకుండా కేవలం తెలుగు భాషలో విడుదలైన ఇరుముడి సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా మూడో వారం సాధించని వసూళ్లను ఇరుముడి సాధించింది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమాలకు సైతం సాధ్యం కాని మూడో వారం నెంబర్స్‌ను ఇరుముడి సొంతం చేసుకుంది. సినిమాను జనాలు ఏ స్థాయిలో హిట్ చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సినిమా సూపర్ హిట్ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ మరోసారి సక్సెస్ వేడుక నిర్వహించారు. ఇంతకు ముందు సక్సెస్ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఈసారి భారీ ఎత్తున సక్సెస్ వేడుకను నిర్వహించడం జరిగింది.
రవితేజ ఇరుముడి సక్సెస్ మీట్‌లో...
'ఇరుముడి' సక్సెస్ మీట్‌లో ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అన్ని వర్గాల వారిని సర్‌ప్రైజ్ చేశాయి. గతంలో గోపీచంద్ మలినేని, రవితేజ కాంబోలో మూడు సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ మూడు సినిమాలు రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. మరోసారి వీరి కాంబో మూవీకి మైత్రి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని 'దాదా' సినిమాను బాలకృష్ణతో చేస్తున్నాడు. చివరి దశ షూటింగ్‌లో ఉన్న దాదా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా దాదాను విడుదల చేయాలని దర్శకుడు గోపీచంద్ మలినేని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. షూటింగ్ ను వచ్చే నెలతో ముగించేలా ప్లాన్ చేశాడని తెలుస్తోంది.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ...
రవితేజతో ఉన్న అనుబంధం, మైత్రి మూవీ మేకర్స్‌తో ఉన్న కనెక్షన్‌తో దర్శకుడు గోపీచంద్ మలినేని 'ఇరుముడి' సినిమా సక్సెస్ వేడుకలో పాల్గొని చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మైత్రి మూవీ మేకర్స్ లో రవితేజతో తాను చేయబోతున్న సినిమా కచ్చితంగా ఇరుముడిని మించి బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తాను అన్నాడు. ఇరుముడి సినిమాను మించి బ్లాక్ బస్టర్ కావడం అంటే మామూలు విషయం కాదు, ఇరుముడి వంటి సక్సెస్‌లు దశాబ్దంకు ఒకటి రెండు మాత్రమే వస్తూ ఉంటాయి. ఇలాంటి హిట్ మళ్లీ రవితేజకు అంటే అది సాధ్యం అయ్యే విషయం కాకపోవచ్చు అని స్వయంగా రవితేజ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. గోపీచంద్ మలినేని ఇంకా మాట్లాడుతూ తాను ఇరుముడిని మించిన బ్లాక్ బస్టర్ కొడతాను, ఆ తర్వాత అనిల్ రావిపూడి, శివ నిర్వాణలు ఆ సినిమాను మించిన బ్లాక్ బస్టర్‌లు తీయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
రవితేజ, గోపీచంద్ మలినేని, మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో మూవీ..
ఒక దర్శకుడు సినిమాను మొదలు పెట్టే సమయంలో కచ్చితంగా అంతకు ముందు వరకు ఉన్న సినిమాల రికార్డ్‌లను బద్దలు కొట్టాలి, ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తారు. అయితే కొన్ని సినిమాలకు పోటీగా తమ సినిమా ఉండాలి అంటే మాత్రం కచ్చితంగా అది అత్యాశ అవుతుంది. ఇరుముడి వంటి సెన్షేషనల్ హిట్ సినిమాను చేయాలంటే రవితేజకు, శివ నిర్వాణ కు చాలా సమయం పడుతుంది. అలాంటిది గోపీచంద్ మలినేని అంతకు మించిన సినిమా తీస్తాను అనడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దర్శకులకు కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని కొందరు సున్నితంగా గోపీచంద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.
ఇరుముడి స్థాయి సినిమాను రవితేజతో గోపీచంద్ మలినేని తీసినా గొప్ప విషయమే అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రవితేజకు క్రాక్ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన గోపీచంద్ మలినేనికి ఇరుముడిని మించిన సినిమా తీయడం కష్టం ఏమీ కాకపోవచ్చు అని కొందరు అంటున్నారు. మొత్తానికి గోపీచంద్ మలినేని వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీ పట్టాలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలోనే సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.