సమంత కోసం మరిన్ని కథలు రెడీ అవుతున్నాయట!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత 'మా ఇంటి బంగారం' సినిమాతో మరోసారి తన స్టామినా నిరూపించుకుంది.

Update: 2026-07-13 14:30 GMT

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత 'మా ఇంటి బంగారం' సినిమాతో మరోసారి తన స్టామినా నిరూపించుకుంది. సమంతకు స్టార్‌ హీరోల స్థాయిలో క్రేజ్ ఉందని మా ఇంటి బంగారం సినిమా వసూళ్లతో నిరూపితం అయ్యింది. విడుదలైన మూడు వారాల్లో సమంత బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. పోటీగా సినిమాలు ఉన్నప్పటికీ, పెద్ది వంటి సినిమా థియేటర్ లలో ఆడుతున్నప్పటికీ మా ఇంటి బంగారం సినిమాను జనాలు ఎగబడి మరీ చూశారు. సమంత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆమె నుంచి రాబోతున్న కొత్త సినిమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్‌ అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆమె తన బేబీ బంప్‌ ఫోటోలను రివీల్‌ చేసింది. ఈ ఏడాదిలోనే సమంత తల్లి కాబోతున్నట్లు ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు.

మా ఇంటి బంగారం సినిమా వసూళ్లు..

సాధారణంగా ఏ హీరోయిన్‌ అయినా ప్రెగ్నెంట్‌ అయితే కనీసం ఏడాది పాటు బ్రేక్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే సమంత సైతం ఏడాది బ్రేక్‌ తీసుకుని తర్వాత సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో సమంత ఖాళీగా ఉండకుండా తప్పకుండా మంచి సినిమా కథల కోసం వెతికే అవకాశాలు ఉంటాయి. మా ఇంటి బంగారం సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కనుక మళ్లీ అలాంటి కథలు సమంతను వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దర్శకులు, రచయితలు సమంత కోసం అలాంటి లేడీ ఓరియంటెడ్‌ యాక్షన్‌ సీన్స్ ఉండే కథలను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సమంత సమయం ఇస్తే కథను చెప్పేందుకు రెడీగా ఉన్నామని చాలా మంది రచయితలు, దర్శకులు అంటున్నారు. సమంత మా ఇంటి బంగారం సినిమా హడావిడి పూర్తి అయిన తర్వాత కొత్త కథలు వినే అవకాశం ఉంది.

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో సమంత...

సమంత ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌లో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్ చూసి చాలా మంది అంతకు మించి అన్నట్లుగా సమంతతో యాక్షన్‌ చేయించాలని కోరుకుంటున్నారు. అందుకోసం భారీ యాక్షన్‌ సీన్స్ ఉండే స్క్రిప్ట్‌లను సమంత కోసం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాల జోరు తగ్గింది. సమంత వల్ల మా ఇంటి బంగారం సినిమా హిట్‌ కావడంతో మళ్లీ లేడీ ఓరియంటెడ్‌ సినిమాల జోరు పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సమంత ఒక వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు సిరీస్‌లపైనా దృష్టి పెడుతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఆమె కథ నచ్చితే సొంత నిర్మాణ సంస్థలో సినిమాలను చేసేందుకు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా త్వరలోనే ఆమె భర్త రాజ్‌ నిడమోరు దర్శకత్వంలోనూ ఒక సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

సమంత ఓ బేబీ సినిమా తర్వాత...

సమంత ఇంతకు ముందు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసింది. ముఖ్యంగా ఈమె నటించిన ఓ బేబీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాని కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. అయినా కూడా సమంత నిరుత్సాహ పడకుండా సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం సినిమాను చేసి రూ.100 కోట్ల నెంబర్‌ను టచ్‌ చేసింది. ముందు ముందు సమంత మరిన్ని వంద కోట్ల లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ తో రాబోతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. సమంత సైతం ఆ స్థాయి కథలు వస్తే తప్పకుండా చేసే అవకాశాలు ఉంది. ప్రస్తుతం సమంత కోసం రెడీ అవుతున్న కథలు సినిమాలుగా మారి, ప్రేక్షకుల ముందుకు రావడానికి కచ్చితంగా రెండు మూడు ఏళ్లు పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది చివరి వరకు సమంత కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సమంత మళ్లీ వెండి తెరపై 2028 లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే కాకుండా హీరోలకు జోడీగా కమర్షియల్‌ హీరోయిన్‌గానూ నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News