ఓటీటీలో మా ఇంటి బంగారం డబుల్ ధమాకా ఖాయం!
సమంత 'మా ఇంటి బంగారం' సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటికే సమంత నటించిన పలు సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో ఉన్న విషయం తెల్సిందే.
సమంత 'మా ఇంటి బంగారం' సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటికే సమంత నటించిన పలు సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో ఉన్న విషయం తెల్సిందే. అయితే లేడీ ఓరియంటెడ్ మూవీతో సమంత ఈ ఫీట్‌ను దక్కించుకోవడం ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొంది గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. సమ్మర్ హాలీడేస్ చివర్లో వచ్చి, బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ సినిమాను ఓటీటీలో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యింది. సినిమాలోని ఎలిమెంట్స్ మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే విధంగా ఉంటాయి. అందుకే ఓటీటీలో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
పెద్ది సినిమా ఓటీటీ స్ట్రీమింగ్...
ఈ మధ్య కాలంలో థియేటర్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల పెద్ది సినిమా స్ట్రీమింగ్ అయింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా వచ్చిన పెద్ది సినిమాకు ఓటీటీ వద్ద మంచి స్పందన దక్కింది. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయమై చర్చ జరుగుతోంది. థియేటర్‌లో విడుదల అయ్యి నాలుగు వారాలు కాబోతున్న నేపథ్యంలో జులై 17న స్ట్రీమింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్‌తో పోల్చితే జియో హాట్ స్టార్ ఖాతాదారులు ఎక్కువ మంది ఉంటారు. కనుక మా ఇంటి బంగారం సినిమాను అత్యధికులు చూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు, మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత మా ఇంటి బంగారం సినిమా...
సాధారణంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఓటీటీలో మంచి స్పందన ఉంటుంది. అలాంటిది సమంత నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ప్రేక్షకులు కచ్చితంగా బ్రహ్మరథం పడుతారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. థియేటర్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను చూడలేక పోయిన వారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఒక అంచనా ప్రకారం థియేటర్‌లో చూసిన వారి కంటే దాదాపుగా డబుల్ ఓటీటీలో మా ఇంటి బంగారం సినిమాను చూసే అవకాశం ఉంది. ఓటీటీ స్ట్రీమింగ్ నేపథ్యంలో సమంత ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మా ఇంటి బంగారం సినిమా సమంత సొంత బ్యానర్‌లో నిర్మించింది. కనుక ఆమె ప్రమోషన్స్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు.
బేబీ బంప్‌తో సమంత ఫోటోలు..
ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ అనే విషయం తెల్సిందే. అయినా కూడా తగ్గడం లేదు. ఇటీవల రూ.100 కోట్ల పోస్టర్‌ను సమంత చూపిస్తున్న ఫోటో వైరల్ అయ్యింది. బేబి బంప్‌తో సమంత వంద కోట్ల పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. ఫ్యామిలీ డ్రామా అయిన ఈ సినిమాను ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా నందిని రెడ్డి రూపొందించింది. అందుకే ఓటీటీలో సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ వ్యూస్ భారీగా నమోదు అవుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ సమయంలో సాధించిన విజయంతో పోల్చితే ఓటీటీలో స్ట్రీమింగ్ తర్వాత మా ఇంటి బంగారం డబుల్ ధమాకా అన్నట్లుగా విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని సమంత అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో సమంత పోషించిన పాత్రకు మంచి మార్కులు పడుతున్నాయి. సగటు తెలుగు వివాహితను చూసినట్టుగా ఉందని రివ్యూలు వచ్చాయి. అందుకే ఓటీటీలోనూ అదే రేంజ్ హిట్ ఖాయం.