కుందనపు బొమ్మలా ఆకట్టుకుంటున్న సమంత!

తెలుగింటి ఆడపడుచులా మరోసారి తెలుగు లోగిళ్ళలో ఒదిగిపోవడానికి సిద్ధమయ్యింది సమంత. మా ఇంటి బంగారం అనే సినిమాతో జూన్ 19వ తేదీన థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయింది.

Update: 2026-06-15 05:57 GMT

తెలుగింటి ఆడపడుచులా మరోసారి తెలుగు లోగిళ్ళలో ఒదిగిపోవడానికి సిద్ధమయ్యింది సమంత. మా ఇంటి బంగారం అనే సినిమాతో జూన్ 19వ తేదీన థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయింది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టిన ఈమె.. మరొకవైపు సోషల్ మీడియాలో కట్టు బొట్టుతో సంప్రదాయంగా కనిపిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగువారిని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కుందనపు బొమ్మలా తయారయ్యి తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.




కుందనపు బొమ్మ..

ఇంస్టాగ్రామ్ వేదికగా చీరకట్టులో ఉన్న ఫోటోలను పంచుకుంది సమంత. చెక్స్ తో డిజైన్ చేసిన లైట్ గ్రీన్ కలర్ చీరకి రెడ్ కలర్ బోర్డర్ తో చక్కగా తీర్చిదిద్దారు. దీనికి కాంబినేషన్లో రెడ్ కలర్ బ్లౌజ్ ధరించింది ఈ ముద్దుగుమ్మ. బుట్ట కమ్మలను చెవులకు ధరించి, ముత్యాలతో డిజైన్ చేసిన చెంపచారలను పెట్టుకుంది. ఇక జుట్టును ఒక సైడ్ కి దువ్విన ఈమె తలలో పువ్వులు పెట్టుకొని చాలా సాంప్రదాయంగా కనిపించింది. మొత్తానికైతే సమంత షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోలు అభిమానులను ఆకట్టుకోవడంతో కుందనపు బొమ్మ మా ముందుకు వచ్చి నిలుచుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




మా ఇంటి బంగారంతో త్వరలో మన ముందుకు..

ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో 4వసారి చేస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. సమంత భర్త ప్రముఖ డైరెక్టర్ , నిర్మాత రాజ్ నిడిమోరు అందించిన కథతో నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత తన భర్త రాజ్, హిమాంక్ దువ్వూరు తో కలిపి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఒక సాధారణ కోడలిగా అత్తారింటికి వచ్చిన ఒక మహిళకు.. ఒక యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ , తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది అనే కథాంశం తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.




మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇకపోతే విడుదల తేదీకి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎక్కడ ఎప్పుడు నిర్వహించనున్నారు అని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాను ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సమంత తన భర్తతో కలిసి ఈవెంట్ కి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఈ జంట నిలవనున్నట్లు సమాచారం. మొత్తానికైతే మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమంత మంచి సక్సెస్ అందుకోవాలని తెలుగు ప్రేక్షకులను ఆమెను ఆదరించాలని ఆశిద్దాం..

Tags:    

Similar News