• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'హ‌ని బ‌న్ని'...

'హ‌ని బ‌న్ని' స్ట్రీమింగుకి ముందు జిమ్‌లో స‌మంత

| తాజాగా స‌మంత ఇన్ స్టాలో జిమ్ లో ఉన్న‌ప్ప‌టి ఓ స్పెష‌ల్ ఫోటోని షేర్ చేసి దానికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ఇచ్చారు. కొన్ని భారీ బరువున్న స్క్వాట్‌లు చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది సామ్‌.

By - Tupaki Desk
Update: 2024-11-04 17:39 GMT

సమంత గ‌త‌ ఆదివారం రాజస్థాన్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలలో ప్రశాంతమైన వెకేష‌న్ ని ఆస్వాధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ప‌చ్చ‌ద‌నం న‌డుమ కొన్ని ఫోటోలు, అడవి జంతువులతో సావాసానికి చెందిన ఫోటోలు వెబ్ లో క‌నిపించాయి. ఈ వారం ప్రారంభంలో సమంత జైపూర్ వెళ్లారు. ప్ర‌ఖ్యాత‌ ర‌ణ‌తంబోర్ డీప్ ఫారెస్ట్ లో విహ‌రించారు. ఈ విహార‌యాత్ర గురించి ముచ్చ‌టిస్తుండ‌గా దృష్టిని మ‌ర‌ల్చేందుకు స‌మంత మ‌రో కొత్త విష‌యంతో ముందుకు వ‌చ్చింది.

తాజాగా స‌మంత ఇన్ స్టాలో జిమ్ లో ఉన్న‌ప్ప‌టి ఓ స్పెష‌ల్ ఫోటోని షేర్ చేసి దానికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ఇచ్చారు. కొన్ని భారీ బరువున్న స్క్వాట్‌లు చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది సామ్‌. షార్ట్‌లు మోకాలి చిప్పల ప‌ట్టీలు నల్లటి భారీ T-షర్టు ధరించి కనిపించింది. ఈ వీడియో క్లిప్‌లో సామ్ హార్డ్ వ‌ర్క్ కి ప్రిపేర‌య్యే విధానం ఆక‌ర్షించింది. ఒక స్క్వాట్ కోసం హెవీ వెయిట్స్‌ని ఎత్తే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు అనిపించింది. ''డిస్ట్రెస్సింగ్ #సిటాడెల్ హ‌నీబ‌న్నీ ఈరోజు నుంచి ప్రీమియర్స్'' అని వెల్ల‌డించింది. ఈ ప్రీమియ‌ర్ కోసం స‌మంత ఇంత‌కుముందే ముంబై న‌గ‌రంలో అడుగుపెట్టిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

సిటాడెల్: హనీ బన్నీ ట్రైల‌ర్ ప్ర‌కారం.. స‌మంత అద్భుత‌మైన యాక్ష‌న్ క్వీన్ గా ఈ సిరీస్ లో అల‌రించ‌నుంది. భారీ స్టంట్స్ లో వరుణ్ ధావన్ తో పోటీప‌డి న‌టించింది. రాజ్ &DK మ‌రోసారి స‌మంత‌కు అద్భుత‌మైన పాత్ర‌లో అవ‌కాశం క‌ల్పించార‌ని అర్థ‌మైంది. ఇందులో స్పెష‌లిస్ట్ స్టంట్‌మ్యాన్ పాత్రలో వరుణ్ నటిస్తుండగా, సమంత గూఢచారి పాత్రలో నటిస్తోంది. కథాంశం వరుణ్ -సమంతల చుట్టూ తిరుగుతుంది. ఐడెంటిటీలు దొర‌క్కుండా ఆ ఇద్ద‌రూ స్పై ఆప‌రేష‌న్ దేని కోసం చేసారు? అన్న‌ది సిటాడెల్ చూసి తెలుసుకోవాల్సిందే. కే కే మీనన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్ త‌దిత‌రులు ఇందులో న‌టించారు.

Tags:    
  • Samantharuthprabhu 
  • Citadel 
  • Honeybunny 
  • Citadelpremier 
  • Varundhawan 
  • Rajanddk 
  • Tollywood 
  • Bollywood 
  • Actress 
  • Bangaram 
  • Shaakuntalam 
  • Khushi 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS