ఆ స్టార్ హీరో సరసన సమంత?
నేషనల్ అవార్డ్ విన్నర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ సినిమా చేయనున్నారని గత కొంత కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.;
నేషనల్ అవార్డ్ విన్నర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ సినిమా చేయనున్నారని గత కొంత కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా వార్తలను నిజం చేస్తూ మేకర్స్ సినిమాను అనౌన్స్ చేస్తూ టైటిల్ ను రివీల్ చేశారు. వెట్రిమారన్- శింబు కలయికలో వస్తున్న ఈ సినిమాకు ఆరసన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు.
శింబు49గా ఆరసన్
శింబు కెరీర్లో 49వ చిత్రంగా వస్తోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత కళైపులి థాను నిర్మిస్తుండగా, సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శింబు సరసన హీరోయిన్ గా సౌత్ స్టార్ హీరోయిన్ సమంతను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మేకర్స్ సమంతతో చర్చలు ప్రారంభించారని టాక్ వినిపిస్తోంది.
శింబు సరసన సమంత?
అయితే ఆ డిస్కషన్స్ ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయని, ఒకవేళ అన్నీ కుదరి, సినిమా కార్యరూపం దాల్చితే శింబు, సమంత కలిసి చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మయోసైటిస్ వ్యాధి వల్ల కొంతకాలం పాటూ సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు తిరిగి సినిమాలను చేస్తున్నారు.
వడ చెన్నై యూనివర్స్ లో భాగంగా ఆరసన్
అయితే గతంలో లాగా ఎక్కువ సినిమాలు చేయడం లేదు సమంత. సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సమంత మళ్లీ చాలా కాలం తర్వాత తమిళంలో సినిమా చేయబోతుందన్న వార్త విని ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. కాగా ఆరసన్ మూవీని వెట్రిమారన్ వడ చెన్నై యూనివర్స్ లో భాగంగా రూపొందించనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు. ఈ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు రానున్నాయని సమాచారం. వెట్రిమారన్, శింబు ఇద్దరూ మంచి టాలెంటెడ్ పర్సన్స్ కావడంతో వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమాపై మంచి అంచనాలున్నాయి.