• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందుకే సినిమాలు...

అందుకే సినిమాలు తగ్గించాను.. సమంత ఊహించని స్టేట్మెంట్!

| అయితే సమంత విడాకుల విషయం కాస్త పక్కన పెడితే.. ఒకప్పుడు ఏడాదికి మూడు,నాలుగు సినిమాలు చేసే సమంత ఇప్పుడు ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా చేయడం లేదు.

By - Madhu Reddy
Update: 2025-08-21 06:39 GMT

సమంత.. ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరి కంటే టాప్ ప్లేస్ లో ఉండేది. అక్కినేని ఫ్యామిలీ వంటి బడా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్ళినా కూడా సినిమాలకు గుడ్ బై చెప్పకుండా మరిన్ని సినిమాల్లో చేసింది. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీకి కోడలిగా వెళ్లాక సమంత ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ ఇమేజ్ ను ఎన్నో రోజులు కాపాడుకోలేకపోయింది. పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది.

సినిమాలు తగ్గించిన సమంత..

అయితే సమంత విడాకుల విషయం కాస్త పక్కన పెడితే.. ఒకప్పుడు ఏడాదికి మూడు,నాలుగు సినిమాలు చేసే సమంత ఇప్పుడు ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా చేయడం లేదు. ఈ విషయంలో సమంత అభిమానుల్లో నిరాశ అయితే ఉంది.అయితే తాజాగా సమంత ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.ఆ కారణం వల్లే నేను సినిమాలు చేయట్లేదు అంటూ చెప్పింది. మరి ఇంతకీ సమంత సినిమాలు తగ్గించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బక్కచిక్కి పోయిన సమంత..

సమంత గత కొద్దిరోజుల నుండి ఒకటి, రెండు సినిమాలకు మాత్రమే కమిట్ అవుతోంది. దానికి ముఖ్య కారణం ఆమెకి ఉన్న ఆరోగ్య సమస్యలు అనుకోవచ్చు. మయాసైటిస్ బారినపడి శరీరం బక్క చిక్కిపోయి అసలు ఈమె సమంతనేనా అనే స్థితిలోకి మారిపోయింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోల్కొని మళ్లీ తన హెల్త్ ని కాపాడుకుంటోంది.

ఆరోగ్యం ముఖ్యం అంటున్న సమంత..

ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత సినిమాల గురించి మాట్లాడుతూ.. "ప్రస్తుతం నేను నా ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫిజికల్ గా, మెంటల్ గా, స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే సినిమాలు చేయగలం. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి ఐదారు సినిమాలు ఓకే చేయలేను. నా శరీర స్పందనను బట్టి సినిమాలను ఓకే చేస్తున్నాను. ముందు నా కంఫర్ట్ చూసుకుంటున్నాను. వర్క్ లోడ్ తగ్గించేసా.. అయితే సినిమాలు తక్కువ చేసినప్పటికీ అందులో క్వాలిటీ మాత్రం తగ్గదు.

తక్కువ ప్రాజెక్ట్ లతోనే మీ ముందుకు వస్తాను..

అందుకే ఒకేసారి ఐదు సినిమాలు కాకుండా నాకు ఇష్టం ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే సంతకం చేస్తున్నాను. అయితే అంతకు ముందు నేను నటించిన సినిమాలు బాగా లేవని కాదు. కానీ ఇకపై నేను నటించబోయే సినిమాలన్నీ కూడా ఉత్సాహంగా చూసేవారికి ఎంటర్టైనింగ్ గా ఉంటాయి" అంటూ చెప్పుకొచ్చింది. అలా ఆరోగ్య సమస్యల వల్లే పని భారాన్ని తగ్గించుకుంటున్నానని కూడా స్పష్టం చేసింది.. డబ్బు,పనికంటే ముఖ్యం ఆరోగ్యం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.ఇదే సూత్రాన్ని సమంత కూడా ఫాలో అవుతోంది. అందుకే సమంతకి అవకాశాలు వచ్చినా కూడా ఓకే చేయడం లేదని తెలుస్తోంది.

సమంత సినిమాలు..

ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. అలాగే రామ్ చరణ్ పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. సమంత చివరిగా తను స్వయంగా నిర్మించిన శుభమ్ మూవీ లో గెస్ట్ రోల్ పోషించింది.

Tags:    
  • Samantha 
  • Tollywood 
  • SamanthaRuthPrabhu 
  • SouthCinema 
  • SamanthaMovies 
  • సమంత 
  • టాలీవుడ్ 
  • సమంతసినిమాలు 
  • సినిమాన్యూస్ 
  • Samantha Upcoming Movies 
  • Filmindustry 

Similar News

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

Copyright @2026

Powered by Blink CMS