మైత్రితో సల్మాన్ ఖాన్ 'ఫ్యామిలీ మ్యాన్'
ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ తుది దశ వర్క్ కోసం మరికొన్ని రోజుల పాటు డేట్లు ఇవ్వాల్సి ఉంది.;
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా హిట్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గత ఏడాది ఆయన నుంచి వచ్చిన సికిందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో సల్మాన్ ఖాన్ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని, ఆ సినిమా అయినా హిట్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రస్తుతం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన వార్తలు అంచనాలు పెంచుతున్నాయి. ఈ మధ్య కాలంలో యుద్ద వీరులకు సంబంధించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. గత ఏడాది వచ్చిన ధురంధర్ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా తో సల్మాన్ ఖాన్ ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.
బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ మూవీ...
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చేస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాను అపూర్వ లఖియా రూపొందిస్తున్నాడు. 2020 సంవత్సరంలో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతుందని మొదటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. టైటిల్ ను బట్టి అది నిజమే అని క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ తుది దశ వర్క్ కోసం మరికొన్ని రోజుల పాటు డేట్లు ఇవ్వాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ ఇప్పటికే తన తదుపరి సినిమాకు సంబంధించిన విషయమై చర్చలు జరుపుతున్నాడు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు తమ తదుపరి సినిమాలను వెంట వెంటనే ప్రకటిస్తూ ఒకే సారి రెండు సినిమాలు చేయడం ద్వారా ఏడాదిలో కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు అయినా వచ్చే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు.
సల్మాన్ ఖాన్ హీరోగా
బాలీవుడ్ హీరోల్లో చాలా మంది ఏడాదికి రెండు అన్నట్లుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. సల్మాన్ ఖాన్ వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నప్పటికీ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆయన బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు. సల్మాన్ ఖాన్ సక్సెస్ కోసం మరో ప్రయత్నం అన్నట్లుగా ప్రముఖ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేలతో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ వచ్చి సూపర్ హిట్ అయింది. అంతే కాకుండా సినిమాలకు కూడా ఈ దర్శక ద్వయం తమవంతు సహకారం అందిస్తూ ఉన్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా వీరి దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ లైన్ రెడీ అయిందని, సల్మాన్ ఖాన్ టీం మెంబర్స్ తో కలిసి రాజ్ అండ్ డీకే లు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నారని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో...
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందబోతున్న సినిమాను తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. సల్మాన్ ఖాన్‌తో సినిమాను నిర్మించేందుకు గాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం ఈ ఏడాది జులై లేదా ఆగస్టు నుంచి డేట్లు కేటాయించేందుకు ఓకే చెప్పాడు. ఇదే ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని, అదే నిజం అయితే 2027 ప్రథమార్థంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్న కారణంగా వర్కింగ్ డేస్ ను తగ్గించి, బడ్జెట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మైత్రి వారు ఈ సినిమాను స్పీడ్‌గా పూర్తి చేయించాలని భావిస్తున్నారు.