• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్.. ఉగ్రం రిమేక్...

సలార్.. ఉగ్రం రిమేక్ కాదని అనడానికి ప్రూఫ్ ఇదే!

| ఉగ్రం, సలార్ ఈ రెండు సినిమాల్లోనూ హీరోల చిన్ననాటి ఎపిసోడ్స్ ఉంటాయి. ఇందులో హీరో తన ఫ్రెండ్ కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.

By - Tupaki Desk
Update: 2023-12-26 05:46 GMT

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్' మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే రూ.178 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న ఏకైక చిత్రంగా రికార్డు సృష్టించింది.

సినిమాకి పాజిటివ్ టాక్ తో పాటు భారీ కలెక్షన్స్ వచ్చినా కూడా సలార్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇది కన్నడ బ్లాక్ బస్టర్ 'ఉగ్రం' కి రిమేక్ అనే వాదనలు ఎక్కువగా వినిపించాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ సినిమా చూసిన చాలామంది ఈ రెండు సినిమాల్లో కొన్ని సిమిలారిటీస్ ని బట్టి సలార్ ఉగ్రం మూవీకి రీమేక్ అంటూ చెబుతున్నారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు.

ఉగ్రం, సలార్ ఈ రెండు సినిమాల్లోనూ హీరోల చిన్ననాటి ఎపిసోడ్స్ ఉంటాయి. ఇందులో హీరో తన ఫ్రెండ్ కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే హీరో మారుమూల గ్రామాల్లో కనిపిస్తాడు. దాంతోపాటు అమెరికా నుండి వచ్చిన హీరోయిన్ కోసం కొన్ని విలన్ గ్యాంగ్స్ వెతుకుతూ ఉంటాయి. అయితే ప్రశాంత్ నీల్ 'ఉగ్రం' సినిమాలో లేని ఓ భారీ ట్విస్ట్ ని 'సలార్' లో పరిచయం చేశాడు. ఉగ్రం సినిమాలో అండర్ వరల్డ్ నుండి హీరోయిన్ కి త్రెట్ ఉంటుంది.

కానీ సలార్ లో అలా కాదు. ప్రశాంత్ నీల్ ఇందులో ఖాన్సార్ అనే ఫిక్షనల్ సిటీని ఆడియన్స్ కి పరిచయం చేశాడు. సినిమాలో ఈ కీలక మార్పు, ఖాన్సార్ కొత్త ప్రపంచాన్ని సృష్టించడం ఒక్కసారిగా సలార్ సెకండాఫ్ పై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలోని కొన్ని అంశాలను ఉగ్రం మూవీ నుంచి తీసుకున్నా తనదైన మేకింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు.

అయితే ఇదే విషయాన్ని నిజాయితీగా అంగీకరిస్తూ ఉగ్రం సినిమా నుంచి స్ఫూర్తి పొందే సలార్ కథను రాయడం జరిగిందని చెప్పాడు. కాగా సలార్ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే కదా. మొదటి భాగం 'సీజ్ ఫైర్' చూసినవాళ్లంతా రెండవ భాగం 'శౌర్యాంగ పర్వం' పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఖాన్సార్ మెయిన్ ప్లాట్ అంతా ఇందులోనే ఉండబోతోంది. సలార్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రశాంత్ నీల్ త్వరలోనే పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    
  • Salaar 
  • Ugram 
  • Prashanthneel 
  • Prabhas 
  • Hombalefilms 
  • Remake 
  • Filmindustry 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS