అందుకే పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకున్నా
ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం, ఒకరి నుంచి చేజారి మరొకరి చేతుల్లోకి ఆ ప్రాజెక్టు వెళ్లడాలు చాలానే చూశాం.;
ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం, ఒకరి నుంచి చేజారి మరొకరి చేతుల్లోకి ఆ ప్రాజెక్టు వెళ్లడాలు చాలానే చూశాం. అయితే ఆ విషయాలు వెంటనే బయటకు రాకపోయినా సందర్భానుసారంగా కొన్నిసార్లు అనుకోకుండా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ విషయమే బయటకు వచ్చింది. గాంఢీవ దారి అర్జున, ఏజెంట్ సినిమాల్లో నటించిన సాక్షి వైద్య విషయంలో కూడా అదే జరిగింది.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ తనను సంప్రదించారని, తర్వాత కొన్ని కారణాల వల్ల తాను ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కానీ మీడియాలో ఈ విషయాన్ని తన గత సినిమాలు ఫ్లాపవడంతోనే ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారని రాశారని చెప్పుకొచ్చారు.
నారీ నారీ నడుమ మురారిలో శర్వాకు జోడీగా..
కాగా ప్రస్తుతం సాక్షి వైద్య ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారి మూవీలో శర్వానంద్ కు జోడీగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సాక్షి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయంలో తనపై వచ్చిన రూమర్లపై స్పందించి, దానిపై అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అవేవీ పట్టించుకోను
ఉస్తాద్ భగత్‌సింగ్ లో కీలక పాత్ర కోసం తనకు అవకాశమొచ్చిన మాట నిజమేనని, కానీ అదే టైమ్ లో తన ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల వేరే ఊరు వెళ్లాల్సి వచ్చిందని, సరిగ్గా అప్పుడే మూవీ టీమ్ రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ ప్రాజెక్టును వదులుకున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమాను చేయకపోవడంపై వచ్చిన వార్తల్ని తాను పట్టించుకోనని, తన పని తాను చేసుకుంటూ పోతానని, అవేవీ తనను ప్రభావితం చేయలేవని ఆమె చెప్పారు.