సైయారా కథ, శ్రీలీల మూవీ స్టోరీ ఒకటేనా? డైరెక్టర్ క్లారిటీ!

బాలీవుడ్ మూవీ సైయారా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. పెద్ద విజయం సాధించింది.;

Update: 2025-07-30 15:30 GMT

బాలీవుడ్ మూవీ సైయారా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. పెద్ద విజయం సాధించింది. విడుదల అయ్యి 11 రోజులు అయినా.. ఇంకా బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. వేరే లెవెల్ వసూళ్లతో అదరగొడుతోంది. ఇండియాలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన లవ్ స్టోరీ మూవీగా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

11 రోజుల్లోనే రూ.404 కోట్లు

అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన సైయారా మూవీని మోహిత్ సూరి తెరకెక్కించారు. ఇప్పటి వరకు 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.404 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. షాహిద్ కపూర్ సినిమా కబీర్ సింగ్ (రూ.379 కోట్లు), అమీర్ ఖాన్ చిత్రం సితారే జమీన్ పర్ (రూ.264 కోట్లు) సినిమాల లైఫ్‌ టైమ్ కలెక్షన్లను దాటేసి దూసుకుపోతోంది.

హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్, కొత్త నటీనటులు, అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మోహిత్ సూరి మేకింగ్ అండ్ టేకింగ్.. సైయారా సినిమాకు ఓ రేంజ్ లో ఆదరణను తెచ్చిపెట్టాయని చెప్పాలి. రొమాంటిక్ డ్రామాలకు ఒక కొత్త బెంచ్‌ మార్క్‌ ను సెట్ చేసిన సైయారా.. త్వరలో రూ.500 కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు.

రెండు కథలు ఒకటేనా?

ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త రూమర్ వినిపిస్తోంది. సైయారా కథ, యంగ్ బ్యూటీ శ్రీలీల మూవీ స్టోరీ ఒకటేనని ఊహాగానాలు స్ప్రెడ్ అవుతున్నాయి. సైయారాలో హీరోయిన్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే. అక్కడ నుంచే సినిమా కథ మలుపులు తిరుగుతుందని చెప్పాలి.

ఇప్పుడు బాలీవుడ్ లో శ్రీలీల చేస్తున్న సినిమా కూడా ఆల్మోస్ట్ అదే కథతో రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ.. దాదాపు సైయారా స్టోరీ లైన్ తోనే ఉంటుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శ్రీలీల రోల్ కు కూడా నయం కాని జబ్బు ఉంటుందనే రూమర్ వినిపిస్తోంది.

డైరెక్టర్ క్లారిటీ

దీంతో ఇప్పుడు డైరెక్టర్ అనురాగ్ బసు రెస్పాండ్ అయ్యారు. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సైయారా స్టోరీకి, తన సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అసలు సినిమాలోని శ్రీలీల రోల్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని చెప్పారు. అయితే శ్రీలీలకు ఇదే బాలీవుడ్ లో డెబ్యూ మూవీ కావడం గమనార్హం. మరి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. అందులో ఆమె రోల్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News