శ్రీలీల, సాయిపల్లవి ఒకే మైండ్ సెట్ తోనా!
`తండేల్` తర్వాత సాయి పల్లవి మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. చూస్తుంటే సాయి పల్లవి ఇదే చివరి తెలుగు సినిమాలా కనిపిస్తుంది.;
`తండేల్` తర్వాత సాయి పల్లవి మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. చూస్తుంటే సాయి పల్లవి ఇదే చివరి తెలుగు సినిమాలా కనిపిస్తుంది. అవును తండేల్ తర్వాత ఇంతవరకూ ఏ తెలుగు సినిమాకు కమిట్ అవ్వలేదు. అవకాశాలు రాక కమిట్ అవ్వలేదేమో అన్న సందేహం నేపథ్యంలో అందుకు ఛాన్సే లేదు. సాయి పల్లవి నటించాలి గానీ నిర్మాతలు ఇంటి ముందునుంచుంటారు. ఆమె డేట్ల కోసం స్టార్ డైరెక్టర్లే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అవకాశాలు రాకపోవడం అన్న మాట లేదు.
అయితే ఆమెని పాత్ర కోసం ఒప్పించడం అన్నది ఏ డైరెక్టర్ కి అయినా కత్తి మీద సాములాంటిందే. ఎందు కంటే ఆమెని పాత్రతో మెప్పించడం అన్నంది అంద ఈజీ కాదు. ఇంకా ఆ రకంగా దర్శకులు వెనక్కి తగ్గు తుండొచ్చు. బాలీవుడ్ లో మాత్రం వరుస కమిట్ మెంట్లు ఇస్తుంది. ప్రస్తుతం `రామాయణం`లో నటిస్తోంది. ఇందులో అమ్మడు సీత పాత్రలో అలరించనుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదటి భాగం షూట్ పూర్తయింది.
ప్రస్తుతం రెండవభాగం షూట్ జరుగుతోంది. అలాగని ఈ సినిమా కోసమే సాయి పల్లవి డేట్లు ఇచ్చేయ లేదు. రెగ్యులర్ చిత్రాలకంటే అదనంగా ఇంకొన్ని రోజులు కేటాయించిందంతే. అంతకు మించి పల్లవి రామాయ ణంలో రేయింబవళ్లు కష్టపడిపోలేదు. `ఏక్ దిన్` అనే మరో సినిమా కూడా చేస్తోంది. మరో రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించి చర్చలు జరుపుతుందన్నది లేటెస్ట్ టాక్. అందులో ఓ ప్రాజెక్ట్ యశ్ రాజ్ బ్యానర్లో అని తెలిసింది.
మరి సాయి పల్లవి తరహాలోనే తెలుగమ్మాయి శ్రీలీల కూడా బాలీవుడ్ జర్నీ మొదలు పెట్టిందా? పల్లవి పంథాలోనే ఆలోచన చేస్తుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ఇటీవలే అఖిల్ `లెనిన్` ప్రాజెక్ట్ ను శ్రీలీల వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు సినిమాల కంటే హిందీ, తమిళ భాషలకే శ్రీలీల ప్రాధాన్యత ఇస్తోంది? అన్న అంశం తెరపైకి వస్తోంది. కెరీర్ ని ఇక్కడే స్థిరపరుచుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారానికి బ్రేక్ పడాలంటే హైబ్రిడ్ పిల్ల- కిసిక్ బ్యూటీ తెలుగు సినిమాలకు కమిట్ అయితే తప్ప తెరపడదు.