బీచ్ లో చెల్లితో సందడి చేసిన సాయి పల్లవి..ఫోటోలు వైరల్!
సాయి పల్లవి.. 'ప్రేమమ్' సినిమా ద్వారా మలయాళ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే.. "భానుమతి.. ఒక్కటే పీస్..హైబ్రిడ్ పిల్ల" అంటూ భారీ పాపులారిటీ అందుకుంది. ఇందులో తెలంగాణ యాసలో చక్కగా ఒదిగిపోయింది సాయి పల్లవి. ఆ తర్వాత సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ "లేడీ పవర్ స్టార్" అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది.
అంతేకాదండోయ్ చాలా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ పాత్రకు ప్రాధాన్యతనిస్తూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే సాయి పల్లవి.. చాలా సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె అటు బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటిస్తున్న రొమాంటిక్ చిత్రం 'ఏక్ దిన్' అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తోంది. ఈ సినిమా 2025 నవంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు రణబీర్ కపూర్ తో కలిసి 'రామాయణం' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో సీత పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది సాయి పల్లవి. అంతేకాదు రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను సుమారుగా రూ.4వేల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఒకవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలను ప్రకటిస్తూ బిజీగా మారిన సాయి పల్లవి.. మరొకవైపు కాస్త సమయం దొరికితే వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే వివాహం చేసుకొని విదేశాలలో సెటిల్ అయిన తన చెల్లెలు పూజా కన్నన్ ఇంటికి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే అక్కడ తన చెల్లితో కలిసి బీచ్ కి సరదాగా వెళ్ళింది. అందుకు సంబంధించిన ఫోటోలను పూజా కన్నన్ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వీరిద్దరూ ఇసుకలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్విమ్ చేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ అక్కాచెల్లెళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేశారు. సూర్యుడి ప్రతాపానికి తట్టుకొని ఈ అక్క చెల్లెలు ఇద్దరు మరింత సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అభిమానులు ఇన్నాళ్లకు సాయి పల్లవిని ఇలా చూడడం మనసుకు హాయిగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా వెకేషన్ కి వెళ్ళిన సాయి పల్లవి తన చెల్లితో మరింత సంతోషంగా గడపడాన్ని మనం చూడవచ్చు ప్రస్తుతం ఈ అక్కాచెల్లెళ్లకు సంబంధించిన బీచ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.