రుక్మిణీ వసంత్ మలయాళ ఎంట్రీ.. షూటింగ్ స్టార్ట్!

సప్త సాగరాలు దాచేయెల్లో అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన రుక్మిణీ వసంత్.. తెలుగులో తొలిసారి నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Update: 2026-08-11 12:55 GMT

ఒక్క సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు అంటే అది హీరోకైనా, హీరోయిన్ కైనా వరుసగా అవకాశాలు వచ్చి పడతాయి. అందులో భాగంగానే మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ తమ అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో రుక్మిణి వసంత్ కూడా ఒకరు. సప్త సాగరాలు దాచేయెల్లో అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన రుక్మిణీ వసంత్.. తెలుగులో తొలిసారి నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేదు.

ఆ తర్వాత తమిళ్ లో శివ కార్తికేయన్ సరసన మదరాసి అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా సక్సెస్ కాలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో డైరెక్టర్ ఈమెకు ఇచ్చిన ఎలివేషన్ కారణంగా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది రుక్మిణి వసంత్. సరైన క్యారెక్టర్ పడితే తనను తాను నిరూపించుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే అని కాంతారా చాప్టర్ వన్ చిత్రంతో నిరూపించింది. ఇందులో కీలకపాత్ర పోషించిన రుక్మిణి వసంత్.. సినిమా మొత్తం సాఫ్ట్ క్యారెక్టర్ తో ఆకట్టుకొని.. క్లైమాక్స్లో ఒక్కసారిగా విలనిజం కనబరిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా కొన్ని కొన్ని సన్నివేశాలలో హీరో రిషబ్ శెట్టి నే డామినేట్ చేసింది అంటే.. తన నటనతో ఏ విధంగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి ఈమె ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ లభించింది .ఈ విషయాన్ని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. నివిన్ పౌలీ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి.. మాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యింది. అందులో భాగంగానే ఈమె ఆన్ సెట్ కి వెళ్లిన సందర్భంగా క్లాప్ బోర్డు పట్టుకొని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మొత్తానికి అయితే రుక్మిణి వసంత్ మాలీవుడ్ లోకి అడుగుపెట్టడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే తాను ఎంతో కాలంగా అభిమానిస్తున్న మాలీవుడ్ సినీ పరిశ్రమలో అవకాశం లభించడంతో తనకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటూ రుక్మిణి చెప్పుకొచ్చింది. ఆ ప్రపంచంలో ఒక చిన్న స్థానం సంపాదించడం తనకు ఒక ముఖ్యమైన తొలి అడుగు అని , ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపింది.

ఈ సినిమాలో నివిన్ పౌలీ హీరోగా నటించడమే కాకుండా తన సొంత బ్యానర్ అయిన పౌలీ జూనియర్ పిక్చర్స్ బ్యానర్ పై మార్టిన్ ప్రాక్కాట్ ఫిలిమ్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు అజు వర్గీస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో తమలయాల సూపర్ హిట్ కామెడీ మూవీ జయ జయ జయ జయ హే అనే చిత్రానికి సహా రచయితగా పనిచేసిన నషీద్ ఫామీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

Tags:    

Similar News