రోషన్ 'ఛాంపియన్'.. వింటేజ్ వైబ్ లో 'గిర గిర' మ్యాజిక్!

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక తన తొలి సినిమాతోనే కమర్షియల్ హిట్ కొట్టి, ఇప్పుడు 'ఛాంపియన్'గా అలరించడానికి సిద్ధమవుతున్నాడు.;

Update: 2025-11-26 05:31 GMT

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక తన తొలి సినిమాతోనే కమర్షియల్ హిట్ కొట్టి, ఇప్పుడు 'ఛాంపియన్'గా అలరించడానికి సిద్ధమవుతున్నాడు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజై మ్యూజిక్ లవర్స్ ను ఫిదా చేస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం, రామ్ మిరియాల గాత్రం కలిసి వింటేజ్ మ్యాజిక్ ను క్రియేట్ చేశాయి. 'గిర గిర గింగిరానివే' అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేలా ఉంది.



 


స్వప్న సినిమా, జెడ్ స్టూడియోస్ బ్యానర్లపై ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ గా వచ్చిన పాట వింటుంటే, ఒక అందమైన పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. "సర సర పొంగరానివే.. సుట్టు తిరిగెలే" వంటి లిరిక్స్ పల్లెటూరి మాండలికంలో చాలా క్యాచీగా ఉన్నాయి.

ముఖ్యంగా ఈ పాటలో హీరోయిన్ అనశ్వర రాజన్ 'చంద్రకళ' పాత్రలో మెరిసిపోయింది. పట్టు లంగాలో ఆమె హావభావాలు, అల్లరి పిల్లగా చేసే సందడి ఆకట్టుకుంటుంది. రోషన్ కూడా వింటేజ్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తూ, హీరోయిన్ వెనుక తిరిగే అబ్బాయిగా మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పాటలో హైలైట్ గా నిలిచింది.

కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటలో మరో ప్రధాన బలం. కొన్ని అనే లైన్స్ లోని డెప్త్, "మబ్బు వెనక మునుపు ఉందో.. ఎండలో దాగి ఏడు రంగుల్లో" వంటి పదాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. రామ్ మిరియాల తనదైన శైలిలో ఈ పాటను హుషారుగా పాడి, వినేవారిలో జోష్ నింపాడు.

ఆట సందీప్ కొరియోగ్రఫీ పాటలోని జానపద బాణీకి తగ్గట్టుగా ఉంది. తోట తరణి ప్రొడక్షన్ డిజైన్, మధి సినిమాటోగ్రఫీ విజువల్స్ ను రిచ్ గా చూపించాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ 1940ల నాటి వాతావరణాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ఒక పక్క ఫుట్ బాల్ ఆట, మరో పక్క స్వచ్ఛమైన ప్రేమకథ.. ఈ రెండింటి కలయికే 'ఛాంపియన్' అని ఈ పాటతో మరో క్లారిటీ ఇస్తోంది.

ఈ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'గిర గిర' పాటతోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పీరియాడిక్ కథలకు ఎప్పుడూ ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. రోషన్, అనశ్వర జంట ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Full View
Tags:    

Similar News