గోల్‌మాల్‌: త‌ల్లి కూతుళ్ల‌ను ఎంపిక చేసుకున్నాడు

ఈ సినిమాలోను కామెడీ- ఫ‌న్ ఎలిమెంట్స్‌తో పాటు య‌థావిథిగా గంద‌రగోళం నుంచి పుట్టుకొచ్చే హాస్యం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు.;

Update: 2025-12-14 16:27 GMT

ఏదైనా సినిమాకి కాస్టింగ్ ఎంపిక చాలా కీల‌క‌మైన‌ది. `దురంధ‌ర్` సినిమాలో హీరో వ‌య‌సులో స‌గం వ‌య‌సు కూడా లేని క‌థానాయిక‌ను ఎంపిక చేయ‌డం నిజంగా ఆడియెన్ కి షాకింగ్. కానీ సారా న‌ట‌న దానిని క‌ప్పి పుచ్చింది. దాంతో కాస్టింగ్ ఎంపిక‌లో లోపాలు బ‌య‌ట‌ప‌డ‌లేదు.

ఇప్పుడు అలాంటి మ‌రో ఎంపిక అభిమానుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈసారి ఒక భారీ సినిమా కోసం కాస్టింగ్ సెలెక్ష‌న్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ `గోల్ మాల్`లో ఐదో సినిమా కోసం ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి ఇలాంటి విల‌క్ష‌ణ‌మైన ఎంపిక‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. సుదీర్ఘ కాలంగా గోల్ మాల్ ఫ్రాంఛైజీని విజ‌య‌వంతంగా న‌డిపించిన రోహిత్ శెట్టి త‌దుప‌రి `గోల్ మాల్ 5`ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు.

ఈ సినిమాలోను కామెడీ- ఫ‌న్ ఎలిమెంట్స్‌తో పాటు య‌థావిథిగా గంద‌రగోళం నుంచి పుట్టుకొచ్చే హాస్యం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ కామెడీ ఫ్రాంచైజీలో కరీనా కపూర్- సారా అలీఖాన్ అజయ్ దేవ్‌గన్‌తో చేరడం ఆశ్చ‌ర్య‌పరుస్తోంది.

ఈ త‌ర‌హా కాస్టింగ్ ఎంపిక మునుపెన్న‌డూ చూడ‌నిది. సారాకు నిజ జీవితంలో క‌రీనా స‌వ‌తి త‌ల్లి. కానీ ఆ ఇద్ద‌రినీ ఒకే సినిమాలో చూపించాల‌నుకోవ‌డం నిజంగా గంద‌ర‌గోళానికి దారి తీయ‌వ‌చ్చు. బ‌హుశా రోహిత్ శెట్టి ఆలోచ‌న కూడా ఇదే. గంద‌ర‌గోళం నుంచి పుట్టుకొచ్చే కామెడీ కోసం అత‌డు త‌ల్లి, స‌వ‌తి కూతురుల‌ను ఎంపిక చేసుకున్నాడు. సైఫ్ ఖాన్ మొద‌టి భార్య కుమార్తె అయిన సారా అలీఖాన్, సైఫ్ ప్ర‌స్తుత భార్య అయిన క‌రీనాతో న‌టించ‌డం స్క్రిప్టు డిమాండ్ మేర‌కేనా? లేక దీని వెన‌క మ‌త‌ల‌బు ఏదైనా ఉందా? అనేది శెట్టి స్వ‌యంగా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. నిజ జీవితంలో తల్లి - సవతి కుమార్తెను ఒకే ఫ్రేమ్ లో చూపించాల‌నుకోవ‌డం వ‌ల్ల సినిమాపై ఉత్సుక‌త పెరుగుతుందన‌డంలో సందేహం లేదు. సారా- క‌రీనా మ‌ధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాల‌నే ఉత్సాహం అభిమానుల్లో ఉంటుంది.

గోల్‌మాల్ 5 సారా అలీ ఖాన్ కెరీర్ కి ప్ల‌స్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్ గోపాల్‌గా తిరిగి క‌నిపిస్తాడు. కరీనా వెర్స‌టైలిటీ .... సారా కామిక్ టైమింగ్ ఈ సినిమాకు అద‌న‌పు బూస్ట్ ని ఇస్తాయ‌నే ఆశిద్దాం. అయితే రోహిత్ శెట్టి భారీ ప్ర‌యోగం ప్రేక్ష‌కుల మైండ్ కి ఏవిధంగా క‌నెక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News