పాన్ ఇండియా స్టార్ అసలు పేరు ప్రశాంత్ శెట్టి!
రిషబ్ శెట్టి ఇప్పుడీ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. `కాంతార`తో ఎనలేని గుర్తింపును దక్కించు కున్నారు.;
రిషబ్ శెట్టి ఇప్పుడీ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. `కాంతార`తో ఎనలేని గుర్తింపును దక్కించు కున్నారు. నటనతో పాటు దర్శకత్వ ప్రతిభతోనూ ఇంతటి గుర్తింపు దక్కింది. పాన్ ఇండియాలో అతడికున్న క్రేజ్ తో తెలుగుతో పాటు హిందీలో ఛాన్సులందుకుంటున్నారు. `కాంతార`తో తనని తానే పాన్ ఇండియా స్టార్ గా తీర్చి దిద్దుకోవడం తనకే సాధ్యమని నిరూపించారు. త్వరలో `కాంతార చాప్టర్ వన్` తో ప్రేక్షకుల ముందుకు రాబోతు న్నారు. ఈ సినిమాపై పాన్ ఇండియాలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకు మంచి బజ్ ని తీసుకొచ్చాయి.
ఈ సినిమా కూడా విజయం సాధిస్తే అతడి స్టార్ డమ్ రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో అతడి పేరు గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసారు. అతడి అసలు పేరు రిషబ్ శెట్టి కాదు. ప్రశాంత్ శెట్టి. అయితే సినిమాల్లోకి వచ్చే ముందు ప్రత్యేకమైన పేరును ఎంచుకోవాలనుకున్నారుట. స్నేహితుల సూచన మేరకు ప్రశాంత్ శెట్టిగా ఉన్న తన పేరును రిషబ్ శెట్టిగా మార్చుకున్నట్లు తెలిపారు. అలా పేరు మార్చుకోవడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయన్నారు. దీంతో అప్పటి నుంచి ఆ పేరును అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
`కాంతార` లాంటి చారిత్రాత్మక చిత్రాల్లో నటించడం ఏ నటుడుకైనా సవాలే అన్నారు. `జైహనుమాన్` , `ఛత్రపతి శివాజీ మహారాజ్`, బకీచంద్ర చఠర్జీ నవల ఆనంద్ మఠ్ అధారంగా తీసే `1770` ఇవన్నీ ఒకే తరహా చిత్రాలు గా పేర్కొన్నారు. వీటిలో నటించడం ఆషామాషీ విషయం కాదన్నారు. ఆ పాత్రల కోసం ప్రత్యేకంగా సన్నధం కావాల్సి ఉంటుందన్నారు. `కాంతార` కోసం ప్రత్యేకంగా గుర్రపుస్వారీ, యుద్ద కళ కలరియ పట్టులో శిక్షణ కోసం చాలా సమయం కేటాయించినట్లు తెలిపారు.
అక్టోబర్ లో `కాంతారా చాప్టర్ వన్` రిలీజ్ అవుతుంది. అనంతరం ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న ` జైహనుమాన్` షూటింగ్ లో పాల్గొంటారు. ఈ సినిమాతో పాటే బాలీవుడ్ లో ఛత్రపతి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. `ఆకాశవాణి` ఫేం అశ్విన్ రంగరాజ్ తో రిషబ్ ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఈ సినిమా మొదలవ్వడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా కమిట్ అయిన చిత్రాలన్నీ పూర్తయిన తర్వాతే ఈసినిమా పట్టాలెక్కించే అవకాశం ఉంది.