కాంతార చాప్టర్ 1 మేకింగ్ వీడియో రిలీజ్.. గూస్ బంప్స్ గ్యారెంటీ!
ఒక సినిమా బాగా వచ్చింది అంటే ఆ సినిమా బాగా రావడం వెనుక ఎంతోమంది కఠినమైన పనితనం దాగి ఉంటుంది.;
ఒక సినిమా బాగా వచ్చింది అంటే ఆ సినిమా బాగా రావడం వెనుక ఎంతోమంది కఠినమైన పనితనం దాగి ఉంటుంది. తెరమీద కేవలం హీరో హీరోయిన్లు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కనిపిస్తారు.కానీ తెరవెనక పనిచేసే డైరెక్టర్ మిగతా టెక్నికల్ టీం మనకు కనిపించరు. సినిమా బాగా రావాలంటే తెరమీద నటించే వారే కాదు.. తెరవెనుక పని చేసేవాళ్ళ హార్డ్ వర్క్ కూడా బాగుండాలి. అలా అయితేనే సినిమా అద్భుతంగా వస్తుంది. అయితే తాజాగా రిషబ్ శెట్టి నటుడిగా..దర్శకుడిగా..చేసిన కాంతార చాప్టర్ 1 మూవీ అక్టోబర్ 2 దసరా కానుకగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయడమే కాకుండా ఈ సినిమాలో నటించిన రిషబ్ శెట్టి నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి.
అయితే ఈ సినిమా తెరమీద ఇంత అద్భుతంగా రావడం వెనక రిషబ్ శెట్టి కష్టం ఎంతో దాగి ఉందట. ఈయన ఈ సినిమా కోసం ఎన్నో కసరత్తులు చేశారు. అలా తాజాగా కాంతార చాప్టర్ 1 మేకింగ్ వీడియోని గురువారం రోజు టీం విడుదల చేశారు.రెండు నిమిషాలు నిడివి తో ఉన్న ఈ వీడియో లో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 కోసం ఎంతలా కష్టపడ్డారో ఆయన కష్టాన్ని చూపించారు.. ఇందులో ఎన్నో కసరత్తులు చేస్తూ..ఎక్సర్సైజులు చేస్తూ తన శక్తికి మించి సినిమా కోసం వర్కౌట్ లు చేశారు. ముఖ్యంగా తెర మీద ఎంతోమందికి గూస్ బంప్స్ తెప్పించిన ఎన్నో యాక్షన్ సీన్స్, స్టంట్ల వెనుక రిషబ్ శెట్టి తెర వెనక చేసిన కఠిన శ్రమ దాగి ఉంది. ఆయన తెర వెనుక ఎంతో కష్టపడడం వల్లే సినిమా అంత అద్భుతంగా వచ్చిందని ఈ మేకింగ్ వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది.
సినిమా కోసం కసరత్తులు చేసిన సమయంలో ఎన్నోసార్లు అలసిపోయి అదే గ్రౌండ్లో పడుకున్న సన్నివేశాలు కూడా ఈ వీడియోలో చూపించారు. అలా తన శక్తికి మించి వర్కౌట్ లు చేసిన రిషబ్ శెట్టికి సంబంధించిన ఈ వీడియోని టీం విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు రిషబ్ శెట్టి కష్టాన్ని మెచ్చుకుంటున్నారు. రిషబ్ శెట్టి కష్టం ఎలాంటిదో ఈ రెండు నిమిషాల వీడియోతో అర్థం చేసుకోవచ్చు సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం తెర వెనుక ఆయన ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగంధూర్,చలువే గౌడ లు నిర్మాతలుగా చేసిన ఈ మూవీలో రిషబ్ శెట్టి దర్శకత్వ బాధ్యతతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ తన గ్లామర్ తో మెరిసింది. అలాగే గుల్షన్ దేవయ్య, జయరాం, ప్రకాష్ తుమినాడ్, హరిప్రసాద్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.750 కోట్ల కలెక్షన్లను సాధించింది.. ఈ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..కాంతార చాప్టర్ 1 ఈనెల అనగా అక్టోబర్ 31న హాలీవుడ్ లో కూడా ఇంగ్లీష్ వెర్షన్ లో విడుదల కాబోతోంది. మరి కాంతార చాప్టర్ -1 మూవీ కోసం రిషబ్ శెట్టి ఎంత కష్టపడ్డారో తెలియాలంటే మీరు కూడా ఓసారి ఈ వీడియో చూడాల్సిందే.