కాంతార చాప్టర్ 1.. లెక్క ఎంతవరకు వెళ్లొచ్చు?
వీకెండ్స్ లో 'కాంతార చాప్టర్ 1' చూపించిన దూకుడుకు, కొత్తగా రిలీజ్ అయిన 'శశివదనే', 'ఆరి', 'కానిస్టేబుల్', 'మటన్ సూప్' లాంటి సినిమాలు కనీస స్థాయిలో మెప్పించలేకపోవడమే కారణం.;
'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద సౌండ్ ఇంకాస్త గట్టిగానే పెంచుతోంది. రిలీజ్ అయ్యి వారాలు గడుస్తున్నా, ఈ సినిమా వీకెండ్ మానియా ఏమాత్రం తగ్గడం లేదు. నిన్నటితో మరో వీకెండ్ పూర్తయింది. కొత్త సినిమాలు వచ్చినా, రిషబ్ శెట్టి సినిమా ముందు అవి నిలబడలేకపోయాయి. డల్ అయినట్టు కనిపించిన కాంతార, శనివారం, ఆదివారం రోజుల్లో అనూహ్యంగా పుంజుకుని థియేటర్లను నింపేయడం ఇండస్ట్రీకి ఒక పెద్ద బూస్ట్.
వీకెండ్స్ లో 'కాంతార చాప్టర్ 1' చూపించిన దూకుడుకు, కొత్తగా రిలీజ్ అయిన 'శశివదనే', 'ఆరి', 'కానిస్టేబుల్', 'మటన్ సూప్' లాంటి సినిమాలు కనీస స్థాయిలో మెప్పించలేకపోవడమే కారణం. ఈ సినిమాలు ఫెయిల్ అవ్వడం కాంతారకు ఒక పెద్ద వరంలా మారింది. మరోవైపు, పవన్ కళ్యాణ్ OGకి డీసెంట్ ఆక్యుపెన్సీలు కనిపించినా, కాంతార అంత దూకుడుగా మాత్రం లేకపోవడం ఫిగర్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
నెక్స్ట్ టార్గెట్ 700 కోట్లు!
'కాంతార చాప్టర్ 1' పది రోజులు కూడా కాకుండానే ₹500 కోట్ల గ్రాస్‌ను సునాయాసంగా దాటేసింది. ఈ జోరు చూస్తుంటే, ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దీపావళికి ఈ సినిమా 700 కోట్ల మార్క్‌ను కూడా అందుకునే అవకాశం ఉంది. ట్రేడ్ అంచనా ప్రకారం, నిన్న ఒక్క రోజే సుమారు 55 కోట్ల దాకా గ్రాస్ వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది.
అయితే, హోంబాలే నుంచి అధికారిక నెంబర్లు రావడానికి కొంత టైమ్ పట్టే అవకాశం ఉంది. ఈ కలెక్షన్ల దూకుడు చూస్తుంటే, ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి. వచ్చే వారం దీపావళి సందర్భంగా 'డూడ్', 'కే ర్యాంప్', 'తెలుసు కదా', 'మిత్రమండలి' లాంటి యూత్‌ఫుల్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ కొత్త సినిమాల నేపథ్యంలో, 'కాంతార చాప్టర్ 1' కలెక్షన్లు కొంతవరకు తగ్గే అవకాశాలు లేకపోలేదు. ఈ సినిమాల్లో ఒకటి రెండు చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా, అది కాంతార దూకుడుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే, ఈ వీకెండ్ తర్వాత రిషబ్ శెట్టి సినిమా ఎంత స్టడీగా నిలబడుతుందో చూడాలి.
ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ కోసం 'కాంతార చాప్టర్ 1' ఇంకా పోరాడుతున్నప్పటికీ, ఇండియాలో మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. అక్కడ వంద కోట్లు దాటుతుందని ఎవరూ ఊహించలేదు. అందుకే, రిషబ్ శెట్టి స్వయంగా ముంబై సింగల్ స్క్రీన్‌లకు వెళ్లి మరీ ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాడు. మొత్తానికి, 'కాంతార చాప్టర్ 1' మరోసారి బాక్సాఫీస్‌ను కుమ్మేసిన మాట వాస్తవం. దీపావళికి కలిసొస్తే లెక్క 700 కోట్లు దాటే అవకాశం ఉంది. కన్నడ ఇండస్ట్రీలో KGF 2 తరువాత అంతగా ఇంపాక్ట్ చూపిన సినిమాగా కాంతార నిలిచింది. ఇక చాప్టర్ 2కి ఇది మరింత బూస్ట్ ఇచ్చే అంశం.