హీరోయిన్ కి తెల్ల చీర గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్..!

ఈ క్రమంలో ఈ సినిమాలో ఒక హీరోయిన్ అయినటువంటి రిద్ధి కుమార్..ఈ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.;

Update: 2025-12-28 08:12 GMT

ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మారుతి దర్శకత్వంలో.. తెరకెక్కిన ఈ సినిమా ఒక కామెడీ హారర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటిస్తున్న.. సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఈ సినిమాలో ఒక హీరోయిన్ అయినటువంటి రిద్ధి కుమార్..ఈ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. స్టేజ్‌పై మాట్లాడిన ఆమె ప్రభాస్‌కు థ్యాంక్స్ చెబుతూ.. ఆయన ఇచ్చిన ఒక ప్రత్యేక గిఫ్ట్ గురించి చెప్పింది. “ప్రభాస్, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్‌కు చాలా థ్యాంక్స్. ఈ చీర నువ్వు నాకు మూడు సంవత్సరాల క్రితం ఇచ్చావు. ఈరోజు ఈ రాత్రి ఈ ఈవెంట్‌లో కట్టుకోవడానికి ఇన్నాళ్లు దాచిపెట్టుకున్నాను” అని ఆమె చెప్పింది.

ఆమె ధరించిన వైట్ చీర ప్రభాస్ ఇచ్చినదే అని తెలిసిన వెంటనే అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ప్రభాస్‌ను ‘సార్’ అని కాకుండా నేరుగా ప్రభాస్ అని పిలవడం కూడా చర్చకు దారితీసింది. ఈ మాటలతో సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి.

రిద్ధి కుమార్‌కు ఇది ప్రభాస్‌తో రెండో సినిమా. అంతకు ముందు రాధే శ్యామ్ చిత్రంలో ఆమె చిన్న పాత్రలో కనిపించింది.



Tags:    

Similar News