పెళ్లి, పిల్లలపై ఆలోచన లేదు.. కానీ!
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా నటి రియా చక్రవర్తి పెళ్లి , పిల్లలపై ఇప్పుడు ఆలోచన లేదు..కానీ దాని గురించి ఆలోచిస్తున్నాను అంటూ ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.;
ఈమె ఒక ప్రముఖ నటి.. కానీ ఓ విషాదం కారణంగా ఎంతో ట్రోలింగ్ ని ఎదుర్కొంది. సోషల్ మీడియాలో ఈమెపై వచ్చిన నెగిటివిటీకి సున్నిత మనస్కులు అయితే సూసైడ్ చేసుకునేవారు. కానీ ఈమె ధైర్యంగా పోరాడి నిలిచింది. బాయ్ ఫ్రెండ్ సూసైడ్ తర్వాత ఈ హీరోయిన్ పై ఎంతో దుష్ప్రచారం జరిగింది. కానీ చివరి వరకు పోరాడింది. ఇక ఆ నటి ఎవరంటే రియా చక్రవర్తి.. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అంటే సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.అయితే అలాంటి ఈ హీరోయిన్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత తరచూ ట్రోలింగ్ ని ఎదుర్కొంది.
రియా చక్రవర్తి వల్లే సుశాంత్ సూసైడ్ చేసుకున్నారనే ప్రచారం జోరుగా వినిపించింది. సుశాంత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తి,ఆమె సోదరుడు ఇద్దరు జైలు జీవితం కూడా గడిపారు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ నిర్దోషులుగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా నటి రియా చక్రవర్తి పెళ్లి , పిల్లలపై ఇప్పుడు ఆలోచన లేదు..కానీ దాని గురించి ఆలోచిస్తున్నాను అంటూ ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రియా చక్రవర్తి మాట్లాడుతూ.. "నేను ఈ మధ్యనే ఓ గైనకాలజిస్ట్ ని కలిసాను. ఆమెతో ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగి తెలుసుకున్నాను.ఎందుకంటే నా వయసు ఇప్పుడు 33 సంవత్సరాలు.
ప్రస్తుతం కెరియర్లో సెట్ కాలేదు. కాబట్టి పెళ్లి, పిల్లల గురించి ఇప్పుడు ఆలోచించలేను. కానీ ప్రతి ఒక్క మహిళలో ఓ వయసు రాగానే పిల్లల గురించి ఆలోచించమని చెబుతారు. అందుకే నేను కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు కెరియర్ లో అంత సెట్ కాలేదు. ప్రస్తుతం నా మనసంతా కెరియర్లో సెట్ అయ్యి ఆ తర్వాత పెళ్లి , పిల్లల గురించి ఆలోచించమని చెబుతుంది. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలనే ఆలోచన లేదు.కానీ ఎగ్స్ ఫ్రీజింగ్ చేయాలి అనుకుంటున్నాను.. అంటూ రియా చక్రవర్తి తాజాగా పాడ్ కాస్ట్ చాప్టర్ 2 లో అతిధి హ్యూమా ఖురేషితో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకుంది.
అయితే గతంలో రియా చక్రవర్తి హ్యూమన్స్ ఆఫ్ బాంబే తో జరిపిన సంభాషణలో మాట్లాడుతూ.. "పెళ్లి చేసుకోవడానికి సరైన వయసుపై నాకు నమ్మకం లేదు.అలాగే పెళ్లి వయసు దాటి ఓ ఏజ్ వచ్చాక పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని చెప్పింది.అంటే రియా చక్రవర్తి లైఫ్ లో సెటిల్ అయ్యాకే అంటే లేటు వయసులో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ఎగ్స్ ఫ్రీజింగ్ ప్రక్రియను ఎంచుకున్నట్టు అర్థమవుతుంది. అలా 33 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని కుటుంబాన్ని ప్రారంభించాలి అనేదాని గురించి ఆలోచించే కంటే ముందే కెరీర్ లో సాధించాల్సినవి చాలా ఉన్నాయని రియా చక్రవర్తి భావిస్తోంది. ఇక రియా చక్రవర్తి తెలుగులో చేసిన ఏకైక మూవీ సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన తూనీగ తూనీగ..ఈ సినిమా తర్వాత మళ్లీ రియా చక్రవర్తి తెలుగులో కనిపించలేదు.