కన్నప్ప: RGV హార్ట్ టచింగ్ కామెంట్స్.. ఆ మాటలకు విష్ణు ఎమోషనల్..
"అందరూ థియేటర్‌కు ప్రభాస్ కోసం వచ్చేస్తారు. కానీ ఇప్పుడు నేను నిన్ను చూడటానికి టికెట్ తీసుకుంటాను" అంటూ ఆర్జీవీ మెసేజ్ ముగించారు.;
‘కన్నప్ప’ సినిమా కోసం మంచు విష్ణు ఎంతగా హార్డ్ వర్క్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శివుడిపై అపారమైన భక్తితో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందుతున్నప్పటికీ.. విష్ణు చేసిన పాత్రపై కొందరు ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా, ఆయన నటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఎమోషనల్ మెసేజ్ పంపడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వర్మ తన మనసులోని మాటలను షేర్ చేస్తూ విష్ణుకి మెసేజ్ పంపారు. “నేను దేవుడిని, భక్తులనూ నమ్మని వ్యక్తిని. అలాంటి నేపథ్యంలో ఏ సినిమా అయినా భక్తి విషయాలపై వస్తే చూస్తాను అనే ఛాన్సే ఉండదు. కానీ ఈ సినిమా క్లైమాక్స్‌లో నువ్వు చేసిన నటన చూసి ఉలిక్కిపడ్డాను. నిజంగా నువ్వు నటించలేదు, ఆ పాత్రగా జీవించావు” అంటూ ఆర్జీవీ మెసేజ్‌లో తెలిపారు.
విష్ణు పోషించిన ‘తిన్నడు’ పాత్రలోని ఓ క్లైమాక్స్ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ.. శివలింగం నుంచి రక్తం ఆగాలంటే తన కన్నులను సమర్పించుకునే క్షణంలో విష్ణు చూపించిన ఎమోషన్‌ను వర్మ ప్రశంసించారు. “ఆ సీన్ నాకు ఇష్టం ఉండదనుకున్నాను. కానీ నువ్వు చూపించిన హృదయవిదారకమైన నటన కారణంగా నేను ప్రేమించాల్సి వచ్చింది,” అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ఆ సన్నివేశంలో విష్ణు ముఖంలో కనిపించిన హావభావాలను స్టన్నింగ్ అంటూ అభివర్ణించారు వర్మ. “నిజాయితీగా శివుడికి లొంగిన తిన్నాడు పాత్ర ద్వారా నువ్వు భావోద్వేగాలను మాస్టరక్లాస్‌లా చూపించావు” అని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు.
"అందరూ థియేటర్‌కు ప్రభాస్ కోసం వచ్చేస్తారు. కానీ ఇప్పుడు నేను నిన్ను చూడటానికి టికెట్ తీసుకుంటాను" అంటూ ఆర్జీవీ మెసేజ్ ముగించారు. దీనిపై స్పందించిన విష్ణు కూడా ఎమోషనల్ అయ్యాడు. “రాము గారు.. మీరు ఏడిపించేశారు. చాలాకాలంగా నా కన్నీళ్లను అణిచిపెట్టుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను దీన్ని తట్టుకోగలనని నమ్మాను. నా జీవితంలో ఇదొక అత్యంత కష్టమైన దశ. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ సందేహం లేదా ద్వేషంతో ఉన్నారు,” అంటూ స్పందించారు.
ఇక భక్తి కథాంశాన్ని ఇష్టపడని ఆర్జీవీ వంటి దర్శకుడి నుంచి వచ్చిన ఈ స్థాయి మెసేజ్.. విష్ణు నటనపై ఎంతగానో ప్రభావం చూపిందని చెప్పవచ్చు. 'కన్నప్ప' సినిమా విషయంలో విష్ణుకీ, ఈ చిత్ర బృందానికి ఇది ఒక గొప్ప గుర్తింపు. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.