దీపావళిని మారణ హోమంతో పోల్చిన ఆర్జీవీ
కానీ ఇప్పుడు ఉన్నట్టుండి దీపావళి పండగపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాడు.. అతడు ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ఇంటర్నెట్ లో దుమారం రేపింది.;
వివాదాస్పద ఆర్జీవీ ఇటీవల స్థబ్ధుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి దీపావళి పండగపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాడు.. అతడు ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ఇంటర్నెట్ లో దుమారం రేపింది. ఆయన గాజా మారణ హోమంతో దీపావళిని పోల్చడంతో నెటిజనులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ''భారతదేశంలో ఒకే ఒక రోజు దీపావళి.. గాజాలో ప్రతి రోజు దీపావళి'' అని వ్యాఖ్యానించాడు. దీనిని చాలా మంది ఖండించారు.
మనం ఎంతో పవిత్రంగా జరుపుకునే దీపావళి పండుగను మారణ హోమంతో పోలుస్తాడా? ఇది షేమ్ అంటూ ఒక ప్రముఖుడు ఆర్జీవీ వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయ నాయకులు, నెటిజన్లు ఆర్జీవీ మానవత్వాన్ని మంటకలుపుతున్నారని అభిప్రాయపడ్డారు. దీపావళి వేడుకను గాజా యుద్ధ నేరంతో పోల్చాడు. మొత్తానికి సామాజిక మాధ్యమాలు ఒక ద్వేషపూరిత వ్యక్తిని కనుక్కునేందుకు సహకరించాయి. అతడిలో ఇంతటి ద్వేషాన్ని ఎప్పటికీ ఆశించనిది... అని ఒకరు వ్యాఖ్యానించారు.
అయితే ఆర్జీవీ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. ప్రతిసారీ పండగల వేళ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉన్నాడు. అతడి స్ట్రాటజీ ఏదైనా కానీ అది విమర్శలకు తావిస్తోంది. 2023 దీపావళి సందర్భంగా ఆయన ఇలాంటి వ్యాఖ్యతో ప్రజల అసహనానికి కారణమయ్యారు. కొందరు యూట్యూబర్లు ఆర్జీవీని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రచురించారు.
ఇటీవల తన స్థాయికి తగ్గ సినిమాలను రూపొందించడంలో విఫలమవుతున్న ఆర్జీవీ తన మాటలు, చేతల పరంగాను విఫలమవుతున్నాడంటూ కొందరు సోషల్ మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు. అయితే అన్నిటికీ సమాధానం ఇచ్చేందుకు ఆర్జీవీ మరో ఇన్నోవేటివ్ ప్లాన్ తో దూసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.