ఆయన్ని ప్రేమించడంలో తప్పేంటి?

బాలీవుడ్ సినీ చరిత్రలో ఎన్నో ప్రేమకథలు వెండితెరపై మెరిశాయి. కానీ కొన్ని బంధాలు మాత్రం తెర‌కు అవతల కూడా దశాబ్దాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసాయి.

Update: 2026-05-24 06:15 GMT

బాలీవుడ్ సినీ చరిత్రలో ఎన్నో ప్రేమకథలు వెండితెరపై మెరిశాయి. కానీ కొన్ని బంధాలు మాత్రం తెర‌కు అవతల కూడా దశాబ్దాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసాయి. అలాంటి వాటిలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నిత్యనూతన సౌందర్యవతి రేఖల సమీకరణం అత్యంత ప్రముఖమైనది. ఇద్ద‌రి మధ్య ఉన్న అనుబంధం గురించి.. ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎన్నో కథనాలు తెర‌పైకి వ‌స్తూనే ఉంటాయి. కాలం ఎంత మారినా? ఇద్దరు దిగ్గజాల చుట్టూ అల్లుకున్న ఆనాటి జ్ఞాపకాలు సినీ ప్రియులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి.

సాధారణంగా సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితాల గురించి లేదా ప్రేమ విషయాల గురించి మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు, ముఖ్యంగా వివాదాలు ఎదురైనప్పుడు మౌనంగా ఉండిపోతారు. కానీ నటి రేఖ ఈ విషయంలో ఎప్పుడూ చాలా భిన్నంగా , ధైర్యంగా నడుచుకున్నారు. ఓ పాత ఇంటర్వ్యూలో ఆమె అమితాబ్ బచ్చన్‌పై తనకున్న అపారమైన గౌరవాన్ని, ప్రేమాభిమానాలను ఎంతో ఓపెన్ గా పంచుకున్నారు. సమాజం ఏమనుకుంటుందనే భయం లేకుండా? మనసులోని నిజాన్ని ఆమె వ్యక్తపరిచిన తీరు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

ఆ ఇంటర్వ్యూలో అమితాబ్‌ను ప్రేమించారా? అనే ప్రశ్నకు రేఖ ఎంతో చాకచక్యంగా, లోతైన సమాధానం ఇచ్చారు. `ఆయన్ని నేను ప్రేమించడంలో తప్పేముంది? కేవలం నన్ను మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా వేలెత్తి చూపుతున్నారు? అని ఆమె ఎదురు ప్రశ్నించారు. అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప వ్యక్తిని, అద్భుతమైన నటుడిని మొత్తం ప్రపంచమే ఆరాధిస్తుందని అందరిలాగే తాను కూడా ఆయనలోని వ్యక్తిత్వాన్ని, ప్రతిభను ఇష్టపడ్డానని స్పష్టం చేశారు. ఎవరైనా సరే? ఆయన ప్రేమలో పడటం సహజమైన విషయమని సమర్థించుకున్నారు.

ఈ వ్యాఖ్యల వెనుక మీడియా -సమాజం ద్వంద్వ విధానంపై రేఖ పరోక్ష విమ‌ర్శ‌లు కూడా చేసారు. ఒక సెలబ్రిటీ బంధంలో ఎప్పుడైనా? వివాదం లేదా పుకార్లు తలెత్తినప్పుడు సమాజం ఎక్కువగా మహిళనే లక్ష్యంగా చేసు కుంటుంది. రేఖ కూడా అదే భావనను వ్యక్తం చేస్తూ ఒక‌ వ్యక్తిని ప్రపంచమంతా ఇష్టపడుతున్నప్పుడు తన వ్యక్తిగత భావాలను మాత్రమే ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారనే ప్రశ్నను లేవనెత్తారు. ఇది ఒక నటి ఆవేదన మాత్రమే కాదు. గ్లామర్ ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే సామాజిక ఒత్తిళ్లకు అద్దం పడుతుంది.

ఎన్ని పుకార్లు, కథనాలు వ‌చ్చినా? రేఖ ఎప్పుడూ అమితాబ్ పట్ల గౌరవాన్ని తగ్గించుకోలేదు. ఆమె మాటల్లో ఎక్కడా చేదు .. కోపం కనిపించదు. బదులుగా ఒక విధమైన ఉదాత్తమైన ఆరాధన భావమే క‌నిపిస్తుంది. తన అంతరం గంలోని భావాలను ఎంతో హుందాగా, కావ్యబద్ధంగా వ్యక్తపరచడం రేఖకు మాత్రమే సాధ్యమైన కళ. అందుకే దశాబ్దాలు గడిచినా? ఇద్ద‌రి గురించి వచ్చే ఏ చిన్న పాత జ్ఞాపకమైనా? సామాజిక మాధ్యమాలలో ..సినిమా వర్గాలలో క్షణాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది.

Tags:    

Similar News