షారూఖ్ కొడుకులాగా తెలుగు హీరో న‌ట‌వార‌సుడు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ పిల్ల‌ల ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్‌లు చాలా త‌క్కువ‌. కుమారుడు మ‌హాధ‌న్, కుమార్తె మోక్ష‌ద ఇద్ద‌రూ లైమ్ లైట్ కి దూరంగానే ఉన్నారు.;

Update: 2025-10-20 08:30 GMT

మాస్ మ‌హారాజా ర‌వితేజ పిల్ల‌ల ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్‌లు చాలా త‌క్కువ‌. కుమారుడు మ‌హాధ‌న్, కుమార్తె మోక్ష‌ద ఇద్ద‌రూ లైమ్ లైట్ కి దూరంగానే ఉన్నారు. టాలీవుడ్ లో జ‌రిగే ఈవెంట్ల‌లో వారిని చూడ‌టం చాలా అరుదు. అయితే ఆ ఇద్ద‌రూ ఇక‌పై సినిమా సెట్ల‌లో బిజీ బిజీగా గ‌డ‌ప‌బోతున్నారని తెలిసింది. ర‌వితేజ కుమార్తె మోక్ష‌ద సినీనిర్మాణంలో అనుభ‌వం ఘ‌డిస్తున్నారు. దీనికోసం సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. అదే స‌మ‌యంలో త‌న సోద‌రుడిని హీరోగా ఎస్టాబ్లిష్ చేసేందుకు కూడా మోక్ష‌ద స‌హ‌కారం అందిస్తారు. ర‌వితేజ అండ‌తో కుమారుడు, కుమార్తె పెద్ద స్థాయికి ఎదిగేందుకు ఆస్కారం ఉంది.

మ‌హాధ‌న్ - `రాజా ది గ్రేట్` చిత్రంలో ర‌వితేజ చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను చేసాడు. అత‌డు టీనేజీలో ఉన్నాడు. త‌దుప‌రి సినీ ఆరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మ‌హాధ‌న్ మొద‌ట కెమెరా వెన‌క టీమ్ లో చేరాడు. ప్ర‌స్తుతం సూర్య హీరోగా వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్న సినిమాకి అసోసియేట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. తెర‌వెన‌క అనుభ‌వం ఘ‌డించాక తండ్రి ర‌వితేజ లానే అత‌డు కూడా అక‌స్మాత్తుగా హీరో అయ్యే అవ‌కాశం ఉంది. స‌హ‌జంగానే సెట్ల‌తో అనుబంధం ఉన్న ఫ్యామిలీ గ‌నుక మ‌హా ధ‌న్ కి ఈ ఆరంగేట్రంతో ఎలాంటి స‌మ‌స్యా లేదు. అతడు స‌హ‌జంగానే సెట్ల‌లో అంద‌రితో క‌లిసిపోగ‌ల‌డ‌ని కూడా తెలిసింది.

ర‌వితేజ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ప‌రిశ్ర‌మ‌లో ఎదిగిన స్టార్. అకుంఠిత ధీక్ష‌, స్వ‌యంకృషితో అత‌డు పెద్ద హీరోగా ఎదిగాడు. కానీ మ‌హాధ‌న్ ఒక పెద్ద స్టార్ కి న‌ట‌వార‌సుడు. అందువ‌ల్ల స‌హ‌జంగానే అత‌డిపై ఒత్తిడి ఉంటుంది. అయితే మ‌హాధ‌న్ త‌న కెరీర్ ని ఎలా నిర్మించుకోవాల‌ని అనుకుంటున్నాడు? ఆరంభం కెమెరా వెన‌క అనుభ‌వం ఘ‌డించాక హీరో అవుతాడా? లేక కింగ్ ఖాన్ షారూక్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ త‌ర‌హాలో డైరెక్ట‌ర్ గా మాత్ర‌మే సెటిల‌వుతాడా? అన్న‌ది వేచి చూడాలి. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమాకి అత‌డు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో అసోసియేట్ గా ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

Tags:    

Similar News