క్రేజీ టైటిల్ ను పట్టేసిన మాస్ మహారాజా
సక్సెస్, ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు మాస్ మహారాజా రవితేజ.;
సక్సెస్, ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆల్రెడీ భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర సినిమాను అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయిన రవితేజ, ఆ సినిమా సెట్స్ పై ఉండగానే తన 67వ సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ
ఈ సినిమాకు అనార్కలీ అనే టైటిల్ పరిశీలనలో ఉందని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తుండగా, ఇప్పుడు ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలొస్తున్నాయి. రవితేజ76వ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ను ఫైనల్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని సమాచారం. రవితేజ సినిమాలకు ఇలాంటి టైటిల్స్ సరిగ్గా సూటవుతాయి. ఇదిలా ఉంటే అనార్కలీ అనే టైటిల్ కంటే ఈ టైటిలే క్రేజీ గా, క్యాచీగా ఉందని ఫ్యాన్స్ కూడా ఆనందిస్తున్నారు.
గ్లింప్స్ రెడీ..కానీ
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, సినిమా గ్లింప్స్ ను ఆల్రెడీ మేకర్స్ రెడీ చేశారు. వాస్తవానికి ఈ సినిమా గ్లింప్స్ దసరాకు రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ కుదరలేదు. త్వరలో రవితేజ నుంచి మాస్ జాతర రిలీజ్ కానుండటంతో ఆ సినిమా తర్వాతే కిషోర్ తిరుమలతో చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని అందుకే గ్లింప్స్ ను వాయిదా వేశారని తెలుస్తోంది.
ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానుంది. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా కిషోర్ తిరుమల తీర్చిదిద్దుతున్నారని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు.