నేనింతే రవితేజ గుర్తు చేసేలా..?..రవితేజతో సమంత మొదటిసారి

ఇక నెక్స్ట్ రవితేజ శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు.;

Update: 2025-11-17 06:49 GMT

మాస్ మహరాజ్ రవితేజ మాస్ జాతర ఈమధ్యనే రిలీజైంది. భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. రవితేజ స్టైల్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చినా కూడా ఎందుకో ఫ్యాన్స్ కూడా సినిమాను యాక్సెప్ట్ చేయలేదు. గత కొన్నాళ్లుగా రవితేజ ఓ పక్క మాస్ సినిమాలు మరోపక్క ప్రయోగాలు చేస్తున్నా కూడా సరైన హిట్టు పడట్లేదు. అయినా సరే తన ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. రవితేజ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన నేనింతే సినిమా డైలాగ్ లానే సినిమా పోయినా ఇంకో సినిమా చేస్తాం.. సినిమా హిట్టైనా ఇంకో సినిమా చేస్తాం.. మనకు సినిమా తప్ప మరే పని రాదు అన్నట్టుగా.. రవితేజ నెక్స్ట్ సినిమాకు రెడీ అయ్యాడు.

నిన్ను కోరి నుంచి ఖుషి వరకు..

మాస్ జాతర రిలీజ్ కు ముందే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సినిమాకు రెడీ అయ్యాడు రవితేజ. ఆ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ పెట్టారు. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్యనే ఆ సినిమా టీజర్ రిలీజై ఆడియన్స్ లో ఒక ఆసక్తి కలిగించింది. ఇక నెక్స్ట్ రవితేజ శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. నిన్ను కోరి నుంచి ఖుషి వరకు శివ నిర్వాణ తన సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. టక్ జగదీష్, ఖుషి ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ శివ తన స్టైల్ తో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్నాడు.

ఐతే ఆఫ్టర్ ఖుషి కాస్త ఎక్కువ గ్యాపే తీసుకున్న శివ నిర్వాణ రవితేజ కోసం ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ రాసుకున్నాడట. రవితేజకు కూడా ఆ కథ బాగా నచ్చేసిందట. క్రైమ్ థ్రిల్లర్ విత్ ఎమోషన్ తో ఈసారి శివ నిర్వాణ అదరగొట్టేస్తాడని అంటున్నారు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా మళ్లీ సమంతనే తీసుకునే ప్లానింగ్ ఉందట. రవితేజతో సమంత మొదటిసారి జోడీ కడుతుంది. ఈ కాంబో సెట్ అయితే ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.

ఈమధ్య తెలుగు సినిమాల్లో కనిపించని సమంత..

సమంత ఈమధ్య తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. బాలీవుడ్ లోనే ఆమె కెరీర్ ప్లాన్ చేస్తుంది. ఐతే రవితేజ సినిమా ఆఫర్ ని ఆమె ఓకే చేసిందని టాక్. ఐతే ఈ సినిమాపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. రవితేజ సమంత కలయిక కచ్చితంగా ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.

ఐతే రవితేజ శివ నిర్వాణ క్రైమ్ థ్రిల్లర్ అనేసరికి ఆడియన్స్ లో కూడా ఆసక్తి మొదలైంది. సరైన సీరియస్ సబ్జెక్ట్ పడితే రవితేజ అదరగొట్టేస్తాడు. ఐతే శివ నిర్వాణ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తెలుసు కాబట్టి కచ్చితంగా ఆడియన్స్ కి ఈ కాంబో ఒక మంచి ట్రీట్ ఇస్తుందని అనిపిస్తుంది. మరి రవితేజ నెక్స్ట్ ఏం చేస్తాడన్నది చూడాలి

Tags:    

Similar News