రవితేజ హీరోయిన్స్.. ఇది అబ్జర్వ్ చేశారా?
ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక భవాని శంకర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించనుంది. ఆమె క్రేజ్ కూడా అంతంత మాత్రమే.;
టాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ మహారాజా రవితేజ గురించి అందరికీ తెలిసిందే. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటారు. ఎప్పుడూ బిజీగానే గడుపుతుంటారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూవీ స్టార్ట్ చేస్తుంటారు. ఆ షూటింగ్ జరుగుతున్న టైమ్ లో కొత్త చిత్రాలకు చర్చలు జరుపుతుంటారు. కొంతకాలంగా ఇదే ధోరణిలో ముందుకువెళ్తున్నారు.
అయితే రవితేజ.. సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.. విజయం అందుకోలేకపోతున్నారు. రీసెంట్ గా మాస్ జాతర మూవీతో థియేటర్స్ లోకి వచ్చారు. కానీ ఆ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా కంప్లీట్ చేసుకోలేక చతికిలపడింది. ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాన్ని సంక్రాంతికి రెడీ చేస్తున్నారు.
కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. జనవరి 14వ తేదీన రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన రవితేజ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మూవీకి ఇప్పటికే సైన్ చేయగా.. త్వరలోనే షూటింగ్ మొదలు కానుందని వినికిడి. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
అదంతా పక్కన పెడితే.. ఇప్పుడు రవితేజ చిత్రాలకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. అదేంటంటే.. రవితేజ సినిమాల్లో కొంతకాలంగా స్టార్ హీరోయిన్స్ మిస్ అవుతున్నారు! నమ్మడానికి కాస్త వింతగా ఉన్నా.. అందుకు కారణాలు కూడా ఉన్నా.. మాస్ మహారాజా నటించిన ఇటీవల చిత్రాల్లో నిజంగా ఒక్క స్టార్ హీరోయిన్ లేకపోవడం గమనార్హం.
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో ఆషిక రంగనాథ్ తో పాటు డింపుల్ హయతి హీరోయిన్లుగా కనిపించనున్నారు. వాళ్ళిద్దరూ స్టార్ బ్యూటీస్ కాదు. ఆషికకు హిట్స్ లేకపోగా.. డింపుల్ కు ఏకంగా సినిమాలే లేవు. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక భవాని శంకర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించనుంది. ఆమె క్రేజ్ కూడా అంతంత మాత్రమే.
ఏదేమైనా రవితేజ ఐదారు ఏళ్లుగా ఒక్క స్టార్ హీరోయిన్ తో వర్క్ చేయలేదు. ఆయన సినిమాల్లో చేసిన తర్వాత శ్రీలీల, మీనాక్షి చౌదరి సహా పలువురు స్టార్ హోదా దక్కించుకున్నారు. రవితేజతో నటించినప్పుడు వారంతా నార్మల్ హీరోయిన్లే అని చెప్పాలి. అయితే బడ్జెట్ ల కారణంగానే హీరోయిన్ల విషయంలో మేకర్స్ రాజీ పడవలసి వస్తుందట. స్టార్ హీరోయిన్ ను తీసుకునే స్కోప్ ఉన్నా.. బడ్జెట్ వల్ల తప్పడం లేదని సమాచారం. ఏదేమైనా రవితేజ హిట్ కొడితే చాలు.. లెక్కలు మారుతాయి!!