క్రేజీ మల్టీస్టారర్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కానా?

ఇప్పుడు తెలుగులో మరో మల్టీస్టారర్ మూవీ రూపొందనున్నట్లు టాక్ వినిపిస్తోంది.;

Update: 2025-10-28 11:32 GMT

టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకే సినిమాలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది హీరోలు కనిపిస్తే సినీ ప్రియులు ఖుషీ అయిపోతుంటారు. అందుకే మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కంప్లీట్ మల్టీస్టారర్స్ లేదా ఓ హీరో సినిమా కోసం మరో హీరోను రంగంలోకి దించుతుంటారు.

ఇప్పుడు తెలుగులో మరో మల్టీస్టారర్ మూవీ రూపొందనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఓ మల్టీస్టారర్ తెరకెక్కేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి.

ఇప్పటికే రవితేజ నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్ కోసం కథ సిద్ధమైందని సమాచారం. బెజవాడ ప్రసన్న కుమార్.. స్టోరీని అందించనున్నారని టాక్. ఇప్పటికే కథను రవితేజతోపాటు నవీన్ కు ఆయన వినిపించారట. ఇద్దరు హీరోలు కూడా స్టోరీ నచ్చిందని చెప్పినట్లు తెలుస్తోంది. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని వినికిడి.

అంతే కాదు దర్శకుడు కూడా సెట్ అయ్యారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో మల్టీస్టారర్ కు సంబంధించిన విషయాలు వెల్లడించనున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు మల్టీస్టారర్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక మంది నెటిజన్లతోపాటు సినీ ప్రియులు స్పందిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. డబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని చెబుతున్నారు. ఎందుకంటే.. రవితేజ , నవీన్ పోలిశెట్టి సినిమాలు అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పుడు వారిద్దరి కాంబోలో మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే రవితేజ, నవీన్ ఇప్పుడు తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. త్వరలోనే రవితేజ మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో సంక్రాంతికి సందడి చేయనున్నారు. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర ప్రమోషన్స్ తో.. నవీన్ అనగనగా ఒక రాజు పనులతో బిజీగా ఉన్నారు. మరి వీరి కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి

Tags:    

Similar News