మాస్ రాజా.. ఇది క్లాస్.. అది మాస్..!
కొన్నాళ్లుగా సరైన హిట్ లేక కాస్త డల్ గా ఉన్న రవితేజ మాస్ జాతరతో మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.;
మాస్ మహారాజ్ రవితేజ ఈ నెల చివర్లో మాస్ జాతర సినిమాతో రాబోతున్నారు. భాను బోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మరోసారి శ్రీలీల జత కట్టింది. రీసెంట్ గా సినిమా నుంచి వచ్చిన మాస్ సాంగ్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక కాస్త డల్ గా ఉన్న రవితేజ మాస్ జాతరతో మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.
రవితేజ చాలా క్లాస్ రోల్..
ఈ సినిమా తర్వాత నెక్స్ట్ 2026 లో రెండు క్రేజీ సినిమాలతో రవితేజ రాబోతున్నారు. అందులో ఒకటి కిశోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తుంది. తన కూల్ మూవీస్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన కిశోర్ తిరుమల మాస్ రాజా రవితేజతో మూవె ఫిక్స్ చేసుకున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఐతే ఈ సినిమాలో రవితేజ చాలా క్లాస్ రోల్ చేస్తున్నారట. తన రెగ్యులర్ సినిమాల్లో పాత్రలకు భిన్నంగా కూల్ అండ్ కాం గోయింగ్ రోల్ లో కనిపిస్తార్ట రవితేజ.
ఈ మూవీ తర్వాత నెక్స్ట్ మార్టిన్ మూవీ డైరెక్టర్ ఏపీ అర్జున్ తో రవితేజ సినిమా లాక్ చేసుకున్నాడు. అతను చెప్పిన యాక్షన్ స్టోరీ నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కన్నడలో మార్టిన్ సినిమాతో డైరెక్టర్ అర్జున్ తన మాస్ స్టామినా చూపించాడు. ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కిన ఆ సినిమా లాస్ట్ ఇయర్ అక్కడ మంచి ఫలితాన్ని అందుకుంది.
పర్ఫెక్ట్ మాస్ స్టోరీతో అర్జున్..
ఐతే రవితేజకు సూటయ్యే ఒక వస్తున్నాడట. ఈ సినిమాను చాలా భారీగా తెరకెక్కించే ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. కిశోర్ తిరుమలతో రవితేజ చేస్తున్న సినిమాకు అనార్కలి అనే టైటిల్ పెట్టబోతున్నారట. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమితా బైజు, డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది.
రవితేజ మాస్ జాతర తో కంబ్యాక్ ఇస్తే రాబోతున్న ఈ రెండు ప్రాజెక్ట్ లు మరింత సందడి చేయనున్నాయి. మాస్ రాజా ఫ్యాన్స్ కి అయితే 2026 డబుల్ ధమాకా అనేలా ఉంది. మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేందుకు ఇక మీదట డిఫరెంట్ స్టోరీస్ పిక్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. మాస్ తో పాటు ఇక మీదట కొత్త కథలు.. డిఫరెంట్ సబ్జెక్ట్ ల మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నారట. ఎలాగు తన ఫ్యాన్ బేస్ కి కరెక్ట్ సినిమా పడితే మంచి హిట్టు పడే అవకాశం ఉంది. అందుకే ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే రవితేజ ఇక మీదట సినిమాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.