ఇరుముడి గ్లింప్స్.. రవితేజ కొత్త ఎమోషనల్ యాంగిల్!

రవితేజ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఫుల్ ఎనర్జీ, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. కానీ నెక్స్ట్ రాబోతున్న ఇరుముడి సినిమా గ్లింప్స్ చూస్తే మాత్రం ఒక సరికొత్త ఫీల్ కలుగుతుంది.

Update: 2026-06-03 06:12 GMT

రవితేజ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఫుల్ ఎనర్జీ, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. కానీ నెక్స్ట్ రాబోతున్న ఇరుముడి సినిమా గ్లింప్స్ చూస్తే మాత్రం ఒక సరికొత్త ఫీల్ కలుగుతుంది. మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ వీడియోలో కమర్షియల్ హంగుల కంటే కూడా ఒక స్వచ్ఛమైన ఎమోషన్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రవితేజను ఒక కొత్త కోణంలో ప్రెజెంట్ చేస్తున్నారని ఈ చిన్న వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.




 


గ్లింప్స్ స్టార్టింగ్ లోనే తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అందమైన బంధాన్ని చాలా న్యాచురల్ గా హైలెట్ చేశారు. ఒకరి కాళ్లు ఒకరు తాకడం, ఉయ్యాల ఊగడం లాంటి చిన్న చిన్న మూమెంట్స్ తో వాళ్ల అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా రాత్రిపూట జలపాతం దగ్గర ఇద్దరూ కలిసి భోజనం చేసే విజువల్స్ చాలా ప్రశాంతంగా, అందంగా ఉన్నాయి. ఈ సీన్స్ చూస్తుంటే సినిమా అంతా ఈ ఎమోషనల్ కనెక్షన్ చుట్టూనే బలంగా తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.

అలాంటి ప్రశాంతమైన వాతావరణం తర్వాత వెంటనే ఒక రస్టిక్ యాక్షన్ సీన్ కట్ చేశారు. రాత్రి వేళ ఇంట్లో రవితేజ ఒక వ్యక్తిని గాల్లోకి ఎగిరి తన్నే యాక్షన్ బ్లాక్ చూస్తుంటే సినిమాలో మరో యాంగిల్ ఉన్నట్లు అర్ధమవుతుంది. ఇదంతా అయ్యాక ఆ చిన్న పాప మందు మానేయ్ నాన్న అని చాలా అమాయకంగా చెప్పే డైలాగ్ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, ఈ కథలో ఉన్న కాన్ఫిక్ట్ ఏంటనేది డైరెక్టర్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా చెప్పేశాడు.

ఇక సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే చివర్లో అయ్యప్ప స్వామి మాలలో ఉన్న రవితేజను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. నలుపు రంగు దుస్తుల్లో నెత్తి మీద ఇరుముడి పెట్టుకుని పాపతో కలిసి వెళ్లే షాట్ బాగా డిజైన్ చేశారు. వీటికి తోడు జి.వి. ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ఎమోషనల్, డివోషనల్ సీన్స్ కు నిజంగానే ప్రాణం పోసింది. తండ్రీకూతుళ్ల విజువల్స్ కు తగ్గట్టుగా సాఫ్ట్ గా సాగిన మ్యూజిక్, స్వామియే శరణం అయ్యప్ప అనే బ్యాక్ గ్రౌండ్ చాంట్స్ తో చివర్లో మంచి వైబ్ ఇచ్చింది.

ఓవరాల్ గా చూస్తే ఈ గ్లింప్స్ లో ఎలాంటి అనవసరపు హడావిడి లేకుండా కథలోని సోల్ ను మాత్రమే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చూపించారు. రెగ్యులర్ మాస్ సినిమాలకు పూర్తి భిన్నంగా రవితేజ చేస్తున్న ఈ జర్నీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచేలా ఉంది. టి సిరీస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో మెప్పిస్తుందో వేచి చూడాలి.



Tags:    

Similar News