మాస్ మహారాజా గేర్ మార్చాడండోయ్!
ఇంతకీ విషయం ఏంటంటే.. మాస్ మహారాజా సినిమా అంటే నిర్మాతలు తను డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందే. అదేమంటే డిమాండ్ అండ్ సప్లైయ్ అన్నట్టుగా రవితేజ వ్యవహరించేవాడట.;
టైమ్‌ని బట్టి అలవాట్లు, నిర్ణయాలు మార్చుకోవాల్సిందే. లేదు ఇవే పాటిస్తూ ఇలాగే ఉంటానంటే సినిమా వరల్డ్‌లో కుదరదు. రూటు మార్చకపోతే లైమ్ లైట్‌లో ఉండరు అన్నది జగమెరిగిన సత్యం. ఈ సత్యాన్ని మాస్ మహారాజా చాలా ఫస్ట్‌గానే పసిగట్టేసినట్టున్నాడు. అందుకే గేర్ మార్చేసి కొత్త పంథాలో పయనించడం మొదలు పెట్టాడు అనే కామెంట్‌లు ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే.. మాస్ మహారాజా సినిమా అంటే నిర్మాతలు తను డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందే. అదేమంటే డిమాండ్ అండ్ సప్లైయ్ అన్నట్టుగా రవితేజ వ్యవహరించేవాడట. ఏ విషయంలోనూ తన రెమ్యునరేషన్ తగ్గించడానికి ఇష్టపడే వాడు కాదంట. ఫ్లాప్ వచ్చినా అదే మాట, సక్సెస్ వచ్చినా మాస్ రాజాది అదే మాట అని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుంచో గుస గుసలు ఓ రేంజ్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. గత మూడేళ్లుగా రవితేజ వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు.
`ధమాకా` తరువాత మాస్ రాజా హిట్టు మాట విని మూడేళ్లవుతోంది. అయినా సరే ఎక్కడా తన రెమ్యునరేషన్‌ని తగ్గించకుండా వస్తున్న రవితేజలో ఉన్నట్టుండి మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. తన పారితోషికం విషయంలో ఎన్నడూ వెనక్కుతగ్గని రవితేజ వరుస ఫ్లాపులు రావడంతో కాస్త వెనక్కు తగ్గాడట. తాజా ప్రాజెక్ట్‌ల విషయంలో దీన్ని అమలు చేస్తున్నాడని స్పష్టమవుతోంది. తన పారితోషికం తగ్గించుకుని లాభాల్లో షేర్ తీసుకునే మోడల్‌కు మాస్ రాజా షిఫ్ట్ అయ్యాడని తెలుస్తోంది.
ఇదే పంథాని అనుసరిస్తూ సరికొత్త ప్రయోగాలకు మాస్ రాజా రెడీ అవుతున్నాడట. రవితేజ నటించిన తాజా మూవీ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`. దీనికి కిషోర్ తిరుమల దర్శకుడు. అషికా రంగనాథ్, డింపుల్ హయాతీ హీరోయిన్‌లు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనితో పాటు తన పంథాకు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తూ రవితేజ దర్శకుడు శివ నిర్వాణతో థ్రిల్లర్ మూవీ `ఇరుముడి`.. యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో సైఫై మూవీలు చేస్తుండటం గమనార్హం.