కేజీఎప్‌, స‌లార్ సంచ‌ల‌నం 8 క్లాస్ ఫెయిల్!

ఆ త‌ర్వాత ఇద్ద‌రు కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. స్టార్ హీరోల చిత్రాల‌కే ప‌నిచేసే అవ‌కాశం ల‌భిం చింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలే ఆ ఇద్ద‌రి కోసం ఎదురు చూసే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.;

Update: 2025-09-16 02:30 GMT

ర‌వి బ‌స్రూర్ నేడు పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం అన్న సంగ‌తి తెలిసిందే. `కేజీఎఫ్`, `స‌లార్` లాంటి పాన్ ఇండియా విజ‌యాల‌తో ఇండియాలోనే గొప్ప మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పేరు గాంచాడు. ప్రస్తుతం అత‌డు ఏ సినిమా చేసినా? అది పాన్ ఇండియా చిత్ర‌మే అవుతుంద‌న్నంత ఫేమ‌స్ అయ్యారు. `ఉగ్రం `సినిమాతో మ్యూజిక్ వ‌రల్డ్ లో కి అడుగు పెట్టాడు. అత‌డిని ప‌రిచ‌యం చేసింది ప్ర‌శాంత్ నీల్. ఆసినిమాతోనే నీల్ కూడా డైరెక్ట‌ర్ గా లాంచ్ అయ్యాడు. ఆ సినిమా హిట్ అవ్వ‌డంతో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో ఇద్ద‌రికీ మంచి పేరొచ్చింది.

ఆ త‌ర్వాత ఇద్ద‌రు కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. స్టార్ హీరోల చిత్రాల‌కే ప‌నిచేసే అవ‌కాశం ల‌భిం చింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలే ఆ ఇద్ద‌రి కోసం ఎదురు చూసే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ట్యాలెంట్ ఉంటే? ఎవ‌రైనా క్యూలో ఉంటారు? అన‌డాన‌కి ఇద్ద‌రు మంచి ఉదాహ‌ర‌ణ‌. కేజీఎఫ్, స‌లార్ లాంటి సినిమాలు అంతే గొప్ప విజ‌యాలు అందించాయి. ప్ర‌స్తుతం సౌత్ లో బిజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ర‌వి కొన‌సాగుతున్నాడు. త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఏర్ప‌డ‌టంతో? పారితోషికం భారీగానే అందుకుంటున్నాడు.

ఒక్కో సినిమాకు కోట్ల‌లో అందుకుంటున్నాడు. బీజీఎమ్ స్పెష‌లిస్ట్ కావ‌డంతో? మ‌ధ్య మ‌ధ్య‌లో కొన్ని సినిమాల‌కు బీజీఎమ్ కూడా అందిస్తున్నాడు. అలాంటి ర‌వి బ‌స్రూర్ ఎనిమిద‌వ త‌ర‌గ‌తి ఫెయిల్ అని ఎంత మందికి తెలుసు? అవును ఈ విష‌యం తానే స్వ‌యంగా వెల్ల‌డించాడు. ఎనిమిద‌వ త‌ర‌గ‌తి ఫెయి లైనా త‌న‌లో సంగీత ద‌ర్శ‌కుడిని గుర్తించి పైకి తీసుకొచ్చింది ప్ర‌శాంత్ నీల్ గా పేర్కొన్నారు. `ఉగ్రం` సినిమాలో అవ‌కాశం ఇవ్వ‌డంతోనే నేడు అంద‌రికీ తెలిసిన‌ట్లు గుర్తు చేసుకున్నాడు.

తాను ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో ర‌వి అనే వ్య‌క్తి డ‌బ్బులివ్వ‌డంతోనే త‌న పేరునే తాను పెట్టుకున్న‌ట్లు తెలిపాడు. అలా నీల్..ర‌వి లేక‌పోతే తాను లేన‌ని..తాను అస‌లు మ్యూజిక్ డైరెక్ట‌రే అయ్యేవా డిని కాద‌న్నారు. త‌న గ‌తం పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని...ట్యాలెంట్ ఉన్నా? అది అక్క‌డితే ఆగిపో యేద‌న్నారు. అందుకే ఏడాది ఒక సినిమా తానే సొంతంగా నిర్మించి కొంత మంది ఔత్సాహికుల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపాడు.

Tags:    

Similar News