ప్రభాస్ పై కన్నేసిన రష్మిక
ఇప్పుడు నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక యాక్టివ్ గా పాల్గొంటుంది.;
నేషనల్ క్రష్ రష్మిక ఈ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ ఇయర్ ఇప్పటికే ఆమె నుంచి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రెండు సినిమాలు హిట్టవగా మరో రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇప్పుడు నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక యాక్టివ్ గా పాల్గొంటుంది.
పలు స్టార్ హీరోలతో నటించిన రష్మిక
సరికొత్త లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో రష్మిక కు జోడీగా దీక్షిత్ శెట్టి నటించగా, ది గర్ల్ ఫ్రెండ్ గురించి అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. ఇప్పటికే సౌత్, నార్త్ లోని పలువురు స్టార్ హీరోలతో నటించారు రష్మిక. తెలుగులో అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్లతో నటించిన రష్మిక, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఆయుష్మాన్ ఖురానా లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
అలాంటి రష్మిక ఇప్పుడు ఇండియన్ స్టార్ హీరోపై కన్నేశారు. ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక చాట్‌సెషన్ ను నిర్వహించగా, అందులో రష్మికకు ఓ ప్రశ్న ఎదురైంది. మీరు ప్రభాస్ తో కలిసి నటిస్తారా? అదే జరిగితే మీ కాంబో హైప్ దెబ్బకు నా శవం థియేటర్లో ఉంటుంది, దాన్ని కలెక్ట్ చేసుకోండని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, దానికి రష్మిక రియాక్ట్ అవుతూ సమాధానమిచ్చారు.
ప్రభాస్ తో నటించాలనుంది
ప్రభాస్ తో కలిసి యాక్ట్ చేయడం తనక్కూడా ఇష్టమేనని, ప్రభాస్ ఈ మెసేజ్ లు చూస్తారని ఆశిస్తున్నా.. తామిద్దరూ కలిసి ఫ్యూచర్ లో నటిస్తే తన కెరీర్లోనే ఆ సినిమా చాలా స్పెషల్ గా నిలుస్తుందని రష్మిక రిప్లై ఇచ్చారు. రష్మిక చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న స్పిరిట్ మూవీ కోసం మేకర్స్ రష్మికను సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఆ ఛాన్స్ యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని వరించింది. మరి రష్మికకు ప్రభాస్ తో కలిసి నటించే ఛాన్స్ ఎప్పుడొస్తుందో చూడాలి.