ర‌ణ్ విజ‌య్‌తో డేట్.. ర‌ష్మిక స్పంద‌న‌కు కౌంట‌ర్!

సినిమాను సినిమాగానే చూడాలి.. ఎవరైనా సినిమాతో ప్రభావితమైతే కంటెంట్‌ను మాత్ర‌మే చూడాలని రష్మిక పేర్కొంది.;

Update: 2025-07-12 04:12 GMT

సినిమాను సినిమాగానే చూడాలి.. ఎవరైనా సినిమాతో ప్రభావితమైతే కంటెంట్‌ను మాత్ర‌మే చూడాలని రష్మిక పేర్కొంది. ప్రేక్షకులను ఫ‌లానా సినిమాయే చూడమని ఎవరూ బలవంతం చేయడం లేదని ర‌ష్మిక అన్నారు. నిజ జీవితంలో ర‌ణబీర్ పోషించిన ర‌ణ్ విజ‌య్ లాంటి వ్య‌క్తితో డేటింగ్ చేస్తారా? అని ప్ర‌శ్నించ‌గా, తాను సిద్ధ‌మేన‌ని ర‌ష్మిక అన్నారు. మ‌నం ఎవరినైనా ప్రేమించినా లేదా ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తే మార్పు దానంత‌ట అదే వ‌స్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను అని ర‌ష్మిక వ్యాఖ్యానించారు.

అయితే నిజ జీవితంలో ఎవ‌రూ అలా మార‌రు! అని హోస్ట్ అన‌గానే, మ‌నం చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి పెరిగిన‌ప్పుడు అత‌డు ఎలాంటి వాడో మ‌న‌కు తెలుస్తుంది. అత‌డిలో మ‌న‌కు ఏది ఇష్ట‌మో ఏది న‌చ్చ‌దో ముందే తెలుస్తుంది. క‌లిసి మెలిసి పెరిగిన స్నేహితుడు లేదా భాగ‌స్వామి.. ఇప్పుడు మారిన వ్య‌క్తిగా కూడా క‌నిపించ‌వ‌చ్చు అంటూ ర‌ష్మిక విశ్లేషించింది. కానీ దీనితో ట్రోల‌ర్స్ విభేధించారు. ర‌ష్మిక‌పై విరుచుకుప‌డ్డారు.

ర‌ష్మిక తో వ‌దిలేయ‌లేదు.. ట్రోల‌ర్స్ ఆలియాను కూడా ట్రోల్ చేసారు. రష్మిక తెలివిగా ఆడుతుంది.. ఒక బింబో అంటూ ఒక నెటిజ‌న్ కామెంట్ చేసాడు. ఆమె ఎక్కువ‌గా మాట్లాడితే నేను ఇష్ట‌ప‌డ‌ను అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించాడు. మొత్తానికి ర‌ష్మిక వ్యాఖ్య‌ల‌పై దుమారం చెల‌రేగుతోంది. ఇదే గొడ‌వ లోకి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కూడా కొంద‌రు నెటిజ‌నులు లాగారు. ర‌ష్మిక‌, విజ‌య్ మాట్లాడ‌టం త‌గ్గించాల‌ని కూడా సూచించారు.

Tags:    

Similar News