సీనియర్ల దారిలోనే రష్మిక?
కిరిక్ పార్టీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక ఆ తర్వాత ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.;
కిరిక్ పార్టీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక ఆ తర్వాత ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న రష్మిక గీతా గోవిందం సినిమా తర్వాత స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారారు. కన్నడ నటిగా జర్నీని మొదలుపెట్టిన రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసి అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుతున్న రష్మిక గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ క్రేజీ వార్త వినిపిస్తోంది. అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక నటిస్తున్నారని అంటున్నారు. అయితే ఇదేమీ క్రేజీ న్యూస్ కాదు, రష్మిక ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి.
ఆల్రెడీ దాని కోసం లాస్ ఏంజెల్స్ లో లుక్ టెస్ట్ కూడా పూర్తవడంతో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టులో రష్మిక భాగం కావడం కన్పర్మ్ అని అందరూ భావిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఛాలెంజెస్ ను స్వీకరిస్తూ వస్తున్న రష్మిక ఈసారి చాలా పెద్ద డెసిషనే తీసుకున్నారు. రష్మిక కెరీర్ మొదటి నుంచి కూడా కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు.
అయితే తన పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో పాటూ, కమర్షియల్ సినిమాల్లో డ్యాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవడం లాంటివి చేసిన రష్మిక పుష్ప, ఛావా, యానిమల్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ ను పెంచుకున్నారు. అయితే రష్మికను అందరి హీరోయిన్ల నుంచి భిన్నంగా ఉంచింది మాత్రం ఆమె స్క్రిప్ట్ సెలక్షనే. రష్మిక నచ్చనివాళ్లు ఆమెను ట్రోల్ చేసినా ఆమె మాత్రం ఎప్పటికప్పుడు తాను నటించిన సినిమాలతో ఆడియన్స్ కు హిట్స్ అందిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఒకప్పుడు సౌందర్య, మీనా, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లు ఓ వైపు గ్లామర్ హీరోయిన్లుగా నటిస్తూనే మరోవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేసి ఆడియన్స్ ను ఆకట్టుకున్నట్టు ఇప్పుడు రష్మిక కూడా వారి దారిలోనే వెళ్తూ కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు. కానీ ఒకవేళ రష్మిక అల్లు అర్జున్ అట్లీ మూవీ చేస్తే మాత్రం ఆ సినిమా తర్వాత రష్మిక కెరీర్ కు ఇక ఇప్పట్లో తిరుగనేదే ఉండదు.