• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ నొప్పి, బాధ వారు కూడా...

ఆ నొప్పి, బాధ వారు కూడా అనుభవించాలి..

| ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా తమ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి రియాల్టీ షోలలో పాల్గొంటూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

By - Madhu Reddy
Update: 2025-11-05 09:45 GMT

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా తమ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి రియాల్టీ షోలలో పాల్గొంటూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది టాప్ షోలలో కూడా పాల్గొంటూ ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగానే నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా నటిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నవంబర్ 7వ తేదీన తెలుగు ,హిందీ భాషల్లో విడుదల కానుండగా.. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నవంబర్ 14వ తేదీన రిలీజ్ కాబోతోంది.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి లీడ్రోల్ పోషిస్తూ వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక జోరుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇదివరకే బిగ్ బాస్ సీజన్ 9 షోలో గెస్ట్ గా పాల్గొని తన సినిమాను ప్రమోట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి విచ్చేసింది. ఎపిసోడ్లో భాగంగా ఆ నొప్పి, బాధ, నరకం మగవారు కూడా అనుభవించాలి అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి మరి రష్మిక ఎందుకు అలాంటి కామెంట్స్ చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే రష్మిక చిన్ననాటి విషయాలను... ఆమె కెరియర్ , సినిమా , వ్యక్తిగత విషయాలు అన్నింటినీ పంచుకుంది. అలాగే జగపతిబాబు ఆమె కోరికను కూడా బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. జగపతిబాబు మాట్లాడుతూ.. మగవారికి కూడా పీరియడ్స్ రావాలని గట్టిగా అనుకున్నట్టు ఉన్నావు కదా! అని ప్రశ్నించగా.. అవును మగవారికి కూడా పీరియడ్స్ రావాలి ?.. అప్పుడే ఆడవారు పడే బాధ, నరకం వారికి తెలుస్తుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు మహిళలు పడే ఇబ్బంది ఏంటో తెలుస్తుంది అంటూ చాలా ఘాటుగా కామెంట్లు చేసింది రష్మిక మందన్న. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక రష్మిక విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె కిరిక్ పార్టీ అనే సినిమా చేసింది..ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. అయితే ఈ సినిమా సమయంలోనే ఇతడితో ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకున్న రష్మిక అనూహ్యంగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కిరిక్ పార్టీ తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో అంజనీపుత్ర, గణేష్ తో ఒక సినిమా చేసిన ఈమె తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన చలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుడిని పలకరించింది ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు వంటి వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది.

పుష్ప, పుష్ప 2 ,యానిమల్, ఛావా, కుబేర, థామా, సికందర్ అంటూ వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు మైసా , రెయిన్బో చిత్రాలను లైన్ లో ఉంచింది

Tags:    
  • rashmikamandanna 
  • thegirlfriend 
  • jagammunischayammura 
  • tollywood 

Similar News

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

2026-11-18 09:53 GMT

Copyright @2026

Powered by Blink CMS