రష్మిక సడెన్‌ గా అలా అనేశారేంటి? మరి నెక్స్ట్ ఏంటి?

తాజాగా ఆ సినిమాకు సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మూవీ టీమ్ మొత్తం హాజరైంది.

Update: 2026-05-18 05:56 GMT

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారారు. సాధారణంగా ఎప్పుడూ హుందాగా, చిరునవ్వుతో కనిపించే రష్మిక.. తాజాగా ఓ ఈవెంట్‌ లో చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒక చిన్న ఎక్సైట్మెంట్‌ లో ఆమె చేసిన కామెంట్స్.. అభిమానులు, సినీ ప్రేక్షకుల మధ్య చర్చకు దారితీశాయి.

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌ గా బిజీగా ఉన్న రష్మిక చేతిలో తెలుగు, హిందీ భాషల్లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ లో ఆమె క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కాక్ టెయిల్ 2 పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్ తో కలిసి రష్మిక నటిస్తున్నారు.

తాజాగా ఆ సినిమాకు సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మూవీ టీమ్ మొత్తం హాజరైంది. నిర్మాత దినేష్ విజన్, దర్శకుడు హోమీ అదజానియా, సంగీత దర్శకుడు ప్రీతమ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్లు కృతి సనన్, రష్మిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆ ఈవెంట్‌ లో మాట్లాడిన రష్మిక.. తన కో హీరోయిన్ కృతి సనన్ అందాన్ని ప్రశంసిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కాక్‌ టెయిల్ 2 లో కృతి చాలా హా*ట్‌ గా కనిపించిందని, అది ప్రపంచానికే తెలుసంటూ ఆమె చెప్పారు. అయితే మాట్లాడుతున్న సమయంలో ఎక్సైట్మెంట్‌ లో అనుకోకుండా ఒక అభ్యంతరకర పదం ఉపయోగించారు. వెంటనే తాను ఏమి మాట్లాడానో గ్రహించిన రష్మిక.. సారీ దాన్ని మ్యూట్ చేయండంటూ నవ్వేశారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ప్రేక్షకుల నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం రష్మికను సమర్థిస్తున్నారు. ఆమె చాలా నేచురల్‌ గా మాట్లాడుతుందని, ఎక్సైట్మెంట్‌ లో అలాంటి పొరపాట్లు జరుగుతాయంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం స్టార్ హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లలో మాటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల కాలంలో బాలీవుడ్‌ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక ఇమేజ్‌ కు ఆ వ్యాఖ్యలు కొంత మైనస్ అవుతాయా అనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటివరకు ఆమెపై పెద్దగా వివాదాలు లేకపోవడంతో ఆ ఘటన మరింత వైరల్ అయింది. అయితే ఇది పెద్ద విషయం కాదని, ఒక సరదా సందర్భంలో జరిగిన చిన్న పొరపాటు మాత్రమేనని ఆమె అభిమానులు చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. కాక్ టెయిల్ 2 జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2012లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కాక్‌ టెయిల్ సినిమాకు ఇది సీక్వెల్‌ గా తెరకెక్కుతోంది. మొదటి భాగం యూత్‌ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో, ఇప్పుడు రెండో పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు రష్మిక ఏమైనా రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.




Tags:    

Similar News