హీరోలే డూప్‌లు వాడేస్తుంటే ఇంత సాహ‌సం ఎందుకు?

ఇలా రిస్క్ యాక్ష‌న్ సీన్‌ల విష‌యంలో బాడీ డ‌బుల్స్‌ని వాడేస్తుంటే హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రిస్క్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-04-30 00:30 GMT

గ‌త కొంత కాలంగా స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాల‌కు హై రిస్క్ ఉన్న యాక్ష‌న్ సీక్వెన్స్‌ల కోసం బాడీ డ‌బుల్‌ని వాడేస్తున్నార‌ని, సాహ‌సాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని, అయితే ఈ విష‌యాన్ని హీరోలు బ‌య‌టికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని న‌టుడు, డైరెక్ట‌ర్ ర‌విబాబు ఇటీవ‌ల ఓ బాంబ్ పేల్చిన విష‌యం తెలిసిందే. హీరోలు ఇలా రిస్క్ యాక్ష‌న్ సీన్‌ల విష‌యంలో బాడీ డ‌బుల్స్‌ని వాడేస్తుంటే హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రిస్క్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

గ‌త ఏడాది ప‌లు క్రేజీ సినిమాల్లో న‌టించి టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలిచిన ర‌ష్మిక ప్ర‌స్తుతం భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి `ర‌ణ‌బాలి`లో న‌టిస్తూనే ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీతో రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ డ్రామా `మైసా`లో న‌టిస్తోంది. దీనికి ర‌వీంద్ర పుల్లె దర్శ‌కుడు. ఇందులో టైటిల్ పాత్ర పోషిస్తున్న ర‌ష్మిక ఈ సినిమా కోసం ఎంత రిస్క్ చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేదు. ఈ సినిమా కోసం మునుపెన్న‌డూ లేని విధంగా ర‌ష్మిక మంద‌న్న ఓ సాహ‌సం చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ కోసం గోండు తెగ‌కు చెందిన మువ‌తిగా ప‌వర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఈ సినిమా కోసం ర‌ష్మిక తాజాగా పెద్ద రిస్కే చేసింద‌ని తెలిసింది. ఆ విష‌యాన్ని స్వ‌యంగా డైరెక్ట‌ర్ ర‌వీంద్ర పుల్లె వెల్ల‌డించ‌డంతో అంతా షాక్ అవుతున్నారు. ఇందులో టైటిల్ పాత్ర పోషిస్తున్న ర‌ష్మిక పాత్ర చాలా ప్ర‌భావ వంతంగా ఉంటుంద‌ని, ఆమె ప్ర‌ద‌ర్శించే కోపం, ఆవేః ఈ సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌న్నారు.

ఇటీవ‌ల కేర‌ళ‌లోని అతిర జ‌ల‌పాతం వ‌ద్ద అత్యంత క్లిష్ట‌మైన ఓ యాక్ష‌న్ సీన్‌ని షూట్ చేశాం. అయితే ఈ స‌న్నివేశం కోసం ర‌ష్మిక 80 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్ లేకుండా దూకారు. ఆ స‌మ‌యంలో ఆమె చేతుల‌కు, కాళ్ల‌కు గాయాల‌య్యాయి. అయినా విరామం తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. సినిమా ప‌ట్ల, న‌ట‌న ప‌ట్ల ఆమెకున్న నిబ‌ద్ధ‌త‌ను చూసి టీమ్ అంతా ఆశ్చ‌ర్య‌పోయాం` అన్నారు.

అయితే ఈ విష‌యం తెలిసిన నెటిజ‌న్‌లు, అభిమానులు మాత్రం స్టార్ హీరోలే రిస్కీ యాక్ష‌న్ సీక్వెన్స్‌లు చేయ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. ఇందు కోసం బాడీ డ‌బుల్‌ల‌ని వాడేస్తున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ఎలాంటి డూప్ లేకుండా ఇలా రిస్క్‌లు చేయ‌డం అవ‌స‌ర‌మా? అని వాపోతున్నారు. 80 అడుగుల ఎత్తులో నుంచి దూక‌డం అనేది క‌రెక్ట్ కాద‌ని, ఇక‌పై అలాంటి రిస్క్‌ల‌కు దూరంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

Tags:    

Similar News